దక్షిణాఫ్రికాకు వెళ్లనున్న టొయోటా ఎతియోస్, లివా కార్లు

అయితే, దక్షిణాఫ్రికా మార్కెట్‌కు సరిపోయే విధంగా ఈ రెండు మోడళ్లలో కొన్ని సాంకేతిక మార్పులను, అదనపు ఫీచర్లను జోడించే ఆస్కారం ఉంది. టొయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రస్తుతం భారత్‌లో ఈ రెండు మోడళ్లను పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. కానీ దక్షిణాఫ్రికాకు ఎగుమతి కానున్న మోడల్ మాత్రం కేవలం పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉండనుంది.
ఎతియోస్, లివా కార్ల బెంగుళూరు శివార్లలో ఉన్న బిడది పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న టొయోటా కిర్లోస్కర్ మోటార్ ప్లాంటులో ఉత్పత్తి ఇవుతున్నాయి. ఎగుమతి మోడల్ కూడా ఇదే ప్లాంటులో ఉత్పత్తి కానుంది. ఈ మేరకు కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.


Click it and Unblock the Notifications








