ప్రమాదం జరిగిన వెంటనే బీమా: ఫ్యూచర్ జనరలి

Accident
మీ వాహనం ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందించిన తక్షణమే.. బీమా డబ్బులు చెల్లించే విధంగా రెండు కొత్త పథకాలను ఫ్యూచర్‌ జనరలి ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రారంభించింది. మోటార్‌ బీమా క్లెయిమ్‌లను మరింత సులభతరం మరియు వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా ఫ్యూచర్‌ ఎక్స్‌ప్రెస్‌, ఫ్యూచర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్లస్‌ అనే రెండు కొత్త సేవలను ప్యూచర్‌ జనరలి ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఫ్యూచర్‌ జనరలి ఇన్సూరెన్స్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.జి కృష్ణమూర్తి రావు మాట్లాడుతూ.. వినియోగదారులకు మరింత వ్యక్తిగతమైన సేవలు అందించేందుకు మరియు మోటార్‌ క్లెయిమ్‌ల పరిష్కారాన్ని మరింత సులభంగా, వేగంగా నిర్వహించేందుకు టచ్‌ పాయింట్లను మెరుగుపరచడమే ఫ్యూచర్‌ ఎక్స్‌ప్రెస్‌, ఫ్యూచర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్లస్‌ పథకాల ప్రాధమిక లక్ష్యమని చెప్పారు.

కంపెనీ ప్రారంభించిన ఈ సేవల ద్వారా తమ వినియోగదారులకు సమయం ఆదా అవడంతో పాటుగా ఖర్చులు కూడా తగ్గుతాయని ఆయన తెలిపారు. ప్యూచర్‌ ఎక్స్‌ప్రెస్‌ పథకంలో వాహనం ప్రమాదానికి గురైన కొద్ది సేపట్లోనే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, అనంతరం వాహన మరమ్మత్తులకు అయ్యే ఖర్చును లెక్కించడం జరుగుతుంది. వాహన మరమ్మత్తులకు అయ్యే ఖర్చును సదరు సర్వీస్ సెంటర్‌కు చెల్లించడం జరుగుతుంది.

కాగా.. ఫూచర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్లస్‌ పథకం క్లెయిమ్ మరింత వేగంగా మరియు సౌలభ్యంగా ఉంటుంది. ఈ పథకంలో ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని సమీపంలో ఉన్న ఫ్యూచర్ జనరల్ కార్యాలయానికి తీసుకువెళ్లాలి. అనంతరం అక్కడ ఉన్న కంపెనీ టెక్నికల్‌ సిబ్బంది ద్వారా మరమ్మత్తులకు అయ్యే ఖర్చును లెక్కగట్టి, సదరు మొత్తంలో 20 శాతం తగ్గించుకొని సొమ్మును ముందుగానే వినియోగదారునికి చెల్లించడం జరుగుతుందని, వాహనదారుడు ఇతర సర్వీస్‌ సెంటర్‌లో మరమ్మత్తులు చేయిస్తే అందుకు అయిన మిగిలిన ఖర్చును వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం ఫ్యూచర్‌ ఎక్స్‌ప్రెస్‌ పథకాన్ని చెన్నై, ముంబయిలోను మరియు ఫ్యూచర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్లస్‌ పథకాన్ని అహమ్మదాబాద్‌, కొల్హాపూర్‌, హైదరాబాద్‌, బెంగుళూరు, త్రివేండ్రంలో ప్రారంభించనున్నట్లు కృష్ణమూర్తి తెలిపారు. 2008లో ఫ్యూచర్ గ్రూప్ మోటారు వాహన బీమా రంగంలోకి ప్రవేశించింది. కంపెనీ అందిస్తున్న వాహన బీమాలో దాదాపు 70 వేల మంది సభ్యులు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2011, 13:23 [IST]
English summary
Future Generali has launched two new motor insurance products - Future Xpress and Future Xpress+. The two products promised to deliver faster and easier service to customers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+