బడ్జెట్ 2011 - ప్రస్తుతానికి కార్ల ధరలు పెరగనట్లే..!

గతేడాది దేశీయ ఆటోమొబైల్ రంగం మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ.. 30 శాతం వృద్ధిని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆటో రంగం కనబరచిన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాంద్యం కారణంగా తగ్గించిన సుంకాలను, ఉద్దీపన పథకాలను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఉపసంహరించుకోవచ్చునని పరిశ్రమ అంచనా వేసింది. కానీ ప్రభుత్వం మాత్రం కొనసాగుతున్న ఆటో జోరుకు బ్రేక్‌లు వేయడం ఇష్టం లేక సుంకాలును యథాతథంగా ఉంచింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆటో పరిశ్రమ స్వాగతించింది. కాబట్టి ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఇప్పట్లో వాహన ధరలు పెరగకపోవచ్చు.


Click it and Unblock the Notifications








