అప్‌గ్రేడెడ్ 2012 హోండా సిఆర్-వి ఫోటోలు విడుదల

2012 Honda CR-V
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా యొక్క భారతీయ అనుబంధ సంస్థ హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎస్‌సిఐఎల్) దేశీయ విపణిలో అందిస్తున్న ఏకైక క్రాసోవర్ "హోండా సిఆర్-వి" మరికొద్ది రోజుల్లో సరికొత్త హంగులతో భారత మార్కెట్లో లభ్యం కానుంది.

అప్‌గ్రేడెడ్ హోండా సిఆర్‌-వి మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో 2012 మోడల్ హోండా సిఆర్‌-వి ఫోటోలను హోండా తన అధికారిక వెబ్‌సైట్లో ఉంచింది. సరికొత్త 2012 హోండా సిఆర్‌-వి క్రాసోవర్‌ను పక్కన ఉన్న చిత్రంలో గమనించవచ్చు.

ఈ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, టాటా ఆరియా వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీని ఇచ్చేందుకు కంపెనీ హోండా సిఆర్‌-విలో కొన్ని మార్పులు చేసి సరికొత్త లుక్‌తో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న హోండా సిఆర్‌-వితో పోలిస్తే, 2012 హోండా సిఆర్‌-వి కాస్తంత పెద్దదిగా ఉండే అవకాశం ఉంది.

కొత్త హోండా సిఆర్-వి ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్‌లలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ చిత్రాన్ని బట్టి గమనిస్తే.. సౌకర్యవంతమైన ఇంటీరియర్ స్పేస్ కోసం వెనుక క్యాబిన్ పరిమాణాన్ని కొద్దిగా పెంచినట్లు తెలుస్తుంది. ఇంకా.. స్పోర్టీ లుక్ కోసం ఫ్రంట్ డిజైన్‌ను కూడా మార్చారు.

అలాగే, కొత్త హోండా సిఆర్-వి హెడ్ ల్యాంప్స్ కూడా చూడటానికి హోండా అకార్డ్ సెడాన్ కారు స్టైల్‌ను పోలి ఉంటాయి. దీన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న హోండా సిఆర్-వి కన్నా అధిక మైలేజ్‌ను ఇచ్చేలా తీర్చదిద్దారు. జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్-పోలో కొత్త సిఆర్-వి దర్శనమిచ్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, October 31, 2011, 12:33 [IST]
English summary
The Honda CRV is the only SUV offered by the Japanese carmaker in India. The CRV has had a decent run in the Indian car market but it has been over shadowed by feature rich cars such as the Toyota Fortuner, BMW X1 and Chevrolet Captiva. Honda has now decided to completely refresh the CRV by offering a redesigned version in 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+