రీనాల్ట్ నుండి అప్‌గ్రేడెడ్ ఫ్లూయెన్స్ డీజిల్ సెడాన్

- డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్: ఆటోమేటిక్ కారులోపలి వాతావరణాన్ని బట్టి ఏసి (ఎయిర్ కండిషనింగ్) పనిచేస్తుంది.
- క్రూయిజ్ కంట్రోల్: కారు వేగాన్ని నియంత్రించే సాధనం.
- ఆటోమేటిక్ లైట్ సెన్సింగ్ హెడ్‌ల్యాంప్స్: వెలుతురుని బట్టి ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే హెడ్‌లైట్లు.
- రెయిన్ సెన్సింగ్ వైపర్స్: వర్షం పడటాన్ని గుర్తించి మనం ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే పనిచేసే వైపర్స్.
- బీజ్ ఇంటీరియర్స్: ఆకర్షనీయమైన రంగులో ఉండి కారు లోపలివైపు ఓ కొత్త లుక్‌నిచ్చే ఇంటీరయర్స్.
రీనాల్ట్ అప్‌గ్రేడ్ చేసిన అందిస్తున్న ఫ్లూయెన్స్ డీజిల్ వేరియంట్ ఈ4 ధర రూ.14.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇందులో 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 105 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








