రూ. 22,000కే బైక్, రూ. 1,00,000 కారు: యూరో గ్రూప్

కేవలం రూ. 1500 డ్యుయెల్ సిమ్, కెమెరా వంటి సదుపాయాలు కలిగిన మొబైల్ ఫోన్‌ను అందిస్తున్నామని, అలాగే.. 11,000 రూపాయలకే లాప్‌టాప్‌లను కూడా అందిస్తున్నామని ఆయన వివరించారు. అయితే తాము అందిచబోయే బైక్, కార్‌ల గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. కంపెనీ వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. తాము మార్కెట్లో విడుదల చేయబోయే బైక్ 100సీసీ ఇంజన్, సెల్ఫ్ స్టార్ట్, నాన్ స్క్రాచబుల్ టెఫ్లాన్ కోటింగ్, డిస్క్ బ్రేక్‌తో లభ్యమవుతుందని పేర్కొనబడి ఉంది. ఇకపోతే కారు విషయానికి వస్తే.. ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్, 600సీసీ ఇంజన్, పవర్ స్టీరింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ వంటి సదుపాయాలతో లభ్యమవుతుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








