మైలేజ్‌లో ఇండికా ఈవీ2తో తలపడనున్న వెర్నా ఆర్‌బి

Hyundai Verna RB
కొత్త కారు కొనేవారు ముఖ్యంగా గమనించే అంశాలు పెర్ఫామెన్స్, మైలేజ్, మెయింటినెన్స్. ఇక ధర అంటారా.. 'పిండి కొద్దీ రొట్టె అన్న సామెత' మనందరికీ తెలిసిందే. కార్లలో అధిక మైలేజ్ కోరుకునే వారి కోసం టాటా మోటార్స్ ఇటీవల "ఇండికా ఈవీ2" కారను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

అయితే మైలేజ్ విషయంలో ఇండికా ఈవీ2కు ఏ మాత్రం తీసిపోనంటోంది హ్యుందాయ్ కొత్త కారు "వెర్నా ఆర్‌బి". దేశపు రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్న వెర్నా ఆర్‌బి సెడాన్ మోడల్ కారు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ప్రకారం.. లీటరుకు 23.5 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని తేలింది.

అంటే ఇండికా ఈవీ2 తర్వాత అత్యధిక మైలేజ్‌నిచ్చే కారు వెర్నా ఆర్‌బినే అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే.. క్రికెట్ ప్రపంచ కప్ 2011ను గెలుచుకొచ్చిన భారత జట్టు సభ్యులకు కూడా హ్యుందాయ్ ఇండియా కంపెనీ ఇదే కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ వెర్నా ఆర్‌బి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. రెండు సీఆర్‌డీఐ డీజిల్ ఇంజన్, రెండు ఎమ్‌పీఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో ఇది లభ్యం కానుంది. 1.4 లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ ఇంజన్‌తో లభించే వెర్నా ఆర్‌బి కారు లీటరు డీజిల్‌కు 23.5 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

భారత రోడ్లపై హ్యుందాయ్ వెర్నా ఆర్‌బి సెడాన్ మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్):

హ్యుందాయ్ వెర్నా ఆర్‌బి - 1.4 లీటర్ ఎమ్‌పీఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ - 17.43 కి.మీ.
హ్యుందాయ్ వెర్నా ఆర్‌బి - 1.6 లీటర్ ఎమ్‌పీఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ - 17.01 కి.మీ.
హ్యుందాయ్ వెర్నా ఆర్‌బి - 1.4 లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ ఇంజన్ - 23.50 కి.మీ.
హ్యుందాయ్ వెర్నా ఆర్‌బి - 1.6 లీటర్ సీఆర్‌డీఐ డీజిల్ ఇంజన్ - 22.32 కి.మీ.

More from DriveSpark

Article Published On: Tuesday, April 12, 2011, 15:13 [IST]
English summary
Country's second largest car maker, Hyundai Motors new varinat of Verna sedan "Verna RB", which is going hit the Indian roads in this year is one of the most fuel efficient car in India. The ARAI certified mileage of Hyundai Verna RB 2011 in India as high as 25.5 KM per litre of Diesel for the 1.4 Litre CRDI Diesel option.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+