భారత ఫార్ములా 1 డ్రైవర్ కోసం విజయ మాల్య వేట..!

భారతదేశపు తర్వాతి ఫార్ములా 1 డ్రైవర్ కోసం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25 నుంచి గాలింపు ప్రారంభిస్తామని, "కోటిలో ఒక్కరి కోసం వేట" అన్నట్లుగా ఈ సెర్చ్ ఉంటుందని, 14-17 ఏళ్లలోపు వయస్సు కలిగిన భారతీయ బాలురు, బాలికల కోసం ఈ సెర్చ్ ఓపెన్ చేయబడి ఉందని మాల్య చెప్పారు. అమృత్‌సర్, బెంగుళూరు, చెన్నయ్, గోవా, హైదరాబాద్, కొల్హాపూర్‌లలో రెండు గో-కార్టింగ్ ప్రాక్టీస్ రౌండ్లు ఏప్రిల్ 25 మరియు జూన్ 7న ప్రారంభమవుతాయి. అనంతరం ఏప్రిల్ 27 మరియు జూన్ 12న రీజనల్ ట్రైల్స్ ఉంటాయి.
ప్రతి నగరంలోనూ ఈ రీజనల్ ట్రైల్స్ ద్వారా 14 మంది ఫైనలిస్ట్‌లను అకాడెమీ ఎంపిక చేయడం జరుగుతుంది. ఇలా ఎంపిక చేసిన 98 మందితో పాటు ఇద్దరిని వైడ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సెలక్ట్ చేసిన మొత్తం 100 మంది ఫైనలిస్ట్‌లు సెప్టెంబర్‌లో జరగనున్న నేషనల్ ఫైనల్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ రేస్‌లో టాప్ 10 స్థానాలను దక్కించుకున్న 10 మంది డ్రైవర్లను బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్‌కు వారం రోజుల పాటు తీసుకువెళ్లడం జరుగుతుంది. వారికి అక్కడ ఎఫ్ 1 రేస్‌కు సంబంధించిన మెళకువలు నేర్పించడం జరుగుతుంది.
ఈ అక్టోబర్ నెలలో ఢిల్లీలోని నోయిడా వద్ద జరగనున్న తొలి ఇండియన్ గ్రాండ్ పిక్స్ ముగ్గురు విజేతలను ప్రకటించడం జరుగుతుంది. అనంతరం రెండేళ్ల పాటు వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత అగ్ర విజేతను బ్రిటన్‌లో జరిగే చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని విజయ మాల్య చెప్పారు. ఈ ముగ్గురిలో మొదటి రన్నరప్ భారత్‌లో జరగబోయే కాంపిటీటివ్ చాంపియన్‌షిప్ ఫుల్ సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని, అలాగే రెండవ రన్నరప్‌కు ఏషియన్ రేసింగ్ స్కూల్‌లో ప్రత్యేకంగా రేసింగ్ ట్యూషన్‌ను కల్పిస్తారు.


Click it and Unblock the Notifications








