'అప్' కారుతో సుజుకి సవాల్ విసరనున్న ఫోక్స్‌వ్యాగన్

భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా నాలుగు డోర్లు కలిగి ఉండేలా ఈ చిన్న కారును ఫోక్స్‌వ్యాగన్ రూపొందించింది. వాస్తవానికి ఫోక్స్‌వ్యాగన్ భారత్‌లో అందుబాటులోకి తీసుకురావాలనుకున్న అప్ కారును మారుతి సుజుకి ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌పై నిర్మించాలనుకుంది. అయితే, ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు ఎడమొఖం పెడమొఖంగా ఉడటంతో.. ఏ-స్టార్, వ్యాగన్ఆర్ కార్లకు ధీటుగా ఫోక్స్‌వ్యాగన్ తన చిన్న కారు అప్‌ను ప్రవేశపెట్టనుంది.
ప్రస్తుతం భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చవక కారు 'పోలో'. కాగా.. ఫోక్స్‌వ్యాగన్ కొత్తగా విడుదల చేయనున్న అప్ చిన్న కారు ధరలో పోలోకు దిగువన ఉండనుంది. ఈ కారు 3.54 మీటర్లు పొడువును మరియు 1.64 మీటర్ల వెడల్పుతో మూడు డోర్లు మాత్రమే కలిగి ఉంటుంది. అయినప్పటికీ.. ఇందులో నలుగురు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. అయితే, ఇండియాలో విడుదల కానున్న అప్ కారు నాలుగు డోర్లను కలిగి ఉండనుంది.
ముందువైపు ఇంజన్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ కలిగిన ఫోక్స్‌వ్యాగన్ అప్ 1-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 59 బిహెచ్‌పిల శక్తిని మరియు 74 ఎన్మ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభించనుంది. ఇంకా ఇది లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీనివ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








