శతాబ్ధాల చరిత్ర కలిగిన బుజ్జి కారు భారత్‌కు రాక..!!

2012 Beetle
శతాబ్ధాల చరిత్ర కలిగిన బుజ్జి కారు ఫోక్స్‌వ్యాగన్ 'బీటెల్' త్వరలోనే భారత్‌కు అధికారికంగా రానుంది. మూడో తరానికి చెందిన ప్రతిష్టాత్మక బీటెల్ కారును దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయనున్నామని జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ పేర్కొంది. వచ్చే ఏడాదిలో ఈ చిన్న కారు దేశీయ రోడ్లపై పరుగులు పెట్టనుంది. ఇప్పటికే మెక్సికోలో ఈ కొత్త కారు ఉత్పత్తి కూడా ప్రారంభమైంది.

రెండో తరానికి చెందిన బీటెల్ కారును 'కొత్త బీటెల్' అని పిలిచేవారు. కాగా.. ప్రస్తుతం మార్కెట్లోకి రానున్న మూడో తరం (థర్డ్ జనరేషన్) బీటెల్ కారును 2012 బీటెల్ అని పిలువనున్నారు. ఇటీవలే ఈ కారును న్యూయార్క్‌లో జరిగిన కార్ షోలో ఫోక్స్‌వ్యాగన్ ఆవిష్కరించింది. బీటెల్‌ కారును తొలిసారిగా 1938లో పరిచయం చేశారు. కాగా.. 1998లో బీటెల్ కారును అప్‌గ్రేడ్ చేసి "ది న్యూ బీటెల్" పేరుతో సెకండ్ జనరేషన్ బీటెల్‌గా తీర్చిదిద్దారు.

ప్రస్తుతం థర్డ్ జనరేషన్‌కు చెందిన సెకండ్ జనరేషన్ బీటెల్ కారు కన్నా కారు 6 ఇంచ్‌ల పొడవును కలిగి ఉంటుంది. సెకండ్ జనరేషన్ బీటెల్ కారు మొత్తం పొడవు 168 ఇంచ్‌లు. అమెరికాలో ఇప్పటికే దాదాపు 215 లక్షల మంది బీటెల్ కార్లను ఉపయోగిస్తున్న సమాచారం. కాగా.. జర్మనీలో ఈ కారును రెండో ప్రపంచ యుద్ధానికి ముందుగా విడుదల చేయడం జరిగింది. అప్పట్లో ఈ కారును ఫోక్స్‌వ్యాగన్‌ అని, "ప్రజల కారు" (పీపుల్స్ కార్) అని పిలిచేవారు.

ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న కొత్త బీటెల్ అంటే రెండో తరానికి చెందిన బీటెల్ కారు అన్నమాట. దేశీయ మార్కెట్లో సెకండ్ జనరేషన్ బీటెల్ కారు ధర రూ. 24.10 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. దీనిని 2009లో కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. భారత్‌లో ఇప్పటి వరకూ 617 న్యూ బీటెల్ కార్లు అమ్మడయ్యాయి.

కాగా.. థర్డ్ జనరేషన్ బీటెల్ కారును సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అమెరికా మార్కెట్లోనూ మరియు అక్టోబర్, నవంబర్ నెలల్లో యూరోపియన్ మార్కెట్లలోనూ, ఆసియా మార్కెట్లలో ఫిబ్రవరి 2012లోనూ విడుదల కానుంది. 2012 బీటెల్ కారు 2.5 లీటర్, 5-సిలిండర్ ఇంజన్‌తో 170 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 19, 2011, 13:28 [IST]
English summary
Volkswagen has confirmed the launch of the third generation Beetle in India. The Iconic Beetle will be seen on Indian roads by next year according to reports. Volkswagen has already begun production of the new car in Mexico.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+