ప్రఖ్యాత జర్మనీ కార్ల తయారీ సంస్ద వోగ్స్ వాగన్ 2010 సంవత్సరానికి సేల్స్ పది రెట్లు పెరిగాయన్నారు. 2010వ సంవత్సరంలో మొత్తం 32627యూనిట్లు అమ్మకాలు జరిపి ఆటోమొబైల్స్ రంగంలో తమ సత్తా చాటామన్నారు. దీనికంతటికి కారణం వోగ్స్ వాగన్ పోలో మరియు వోగ్స్ వాగన్ వెంటో కార్లు అని అన్నారు. గత సంవత్సరం 3039 యూనిట్లు అమ్మకాలు జరపగా 2010లో 32627యూనిట్లు అమ్మకాలు జరపామన్నారు. పోలో మరియు వెంటో కార్లు వల్లనే ఈఘనతను సాధించామని అన్నారు.
ఈసందర్బంలో కంపెనీ డైరెక్టర్(సేల్స్)ఇండియా మాట్లాడుతూ ఈసంవత్సరం మేము ప్రవేశపెట్టనటువంటి మోడల్స్ వల్ల మాకస్టమర్స్ వద్ద నుండి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం అన్నారు. ఈయొక్క సేల్స్ ను దృష్టిలో పెట్టుకోని వోగ్స్ వాగన్ కున్నటువంటి డీలర్ నెట్ వర్కు నుండి 40 నుంచి 70వరకు పెంచుతున్నామని తెలిపారు.