మే, 2011లో 244 శాతం పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా సేల్స్

కంపెనీ మొత్తం మే నెల విక్రయాలలో 5,889 యూనిట్లు పోలో, వెంటో మోడళ్లే ఉన్నాయి. భారత మార్కెట్లో ఇంత భారీ విజయం సాధించడానికి ఈ రెండు మోడళ్లే కారణమని కంపెనీ తెలిపింది. కాగా.. కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టిన బ్లూమోషన్ టెక్నాలజీ పస్సాట్ కారు గత నెలలో 184 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకూ ఫోక్స్‌వ్యాగన్ విక్రయాలను పరిశీలిస్తే కంపెనీ మొత్తం విక్రయాలు 33,958 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు ఇదే కాలానికి ఇవి 32,627 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








