ఒకప్పటి ఫోక్స్‌వ్యాగన్ ప్రజల కారు.. మరోసారి తెరపైకి..!

అమెరికాలో దాదాపు 215 లక్షల బీటెల్ కార్లు ఉన్నట్లు సమాచారం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో ఈ కారును విడుదల చేశారు. ఆ సమయంలో దీనిని ఫోక్స్‌వ్యాగన్ అని, "ప్రజల కారు" (పీపుల్స్ కార్) అని పిలిచేవారు. అంటే ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్‌గా చెప్పుకునే కంపెనీ పేరు అప్పట్లో ఓ కారు పేరు అన్నమాట. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ ప్రపంచపు మూడో అతిపెద్ద ఆటోమేకర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే.
కాగా.. తాజాగా ప్రదర్శించిన ఐకానిక్ మోడల్ బీటెల్ కారును సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అమెరికా మార్కెట్లోనూ, అలాగే... అక్టోబర్, నవంబర్ నెలల్లో యూరోపియన్ మార్కెట్లలోనూ, ఆసియా మార్కెట్లలో ఫిబ్రవరి 2012లోనూ విడుదల కానుంది. 2.5 లీటర్, 5-సిలిండర్ ఇంజన్ సామర్థ్యం కలిగిన కొత్త బీటెల్ చిన్న కారు 170 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications








