ప్రపంచపు అగ్రస్థానంపై కన్నేసిన ఫోక్స్‌వ్యాగన్

ఇందులో భాగంగా ఫోక్స్‌వ్యాగన్ తన మొత్తం వార్షిక అమ్మకాలను 10 మిలియన్లకు పైగా పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపింది. ఈ మేరకు తమ లక్ష్యాన్ని సాధించే దిశగా భారీ మొత్తాలలో పెట్టుబడులను వెచ్చించనున్నామని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది.
ప్రస్తుతం, అమెరికాకు చెందిన ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ప్రపంచపు నెంబర్ వన్ కార్‌మేకర్‌గా ఉంది. ఈ స్థానంలో ఉన్న టొయోటాను ఇటీవలే జనరల్ మోటార్స్ ఓవర్‌టేక్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే, పెట్టుబడుల వివరాలను వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించింది.
ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ ప్రపంచపు మూడో అతిపెద్ద కార్ గ్రూపు. బెంట్లీ, బుగాటీ, స్కానియా, స్కొడా మరియు పోర్షే వంటి ఎన్నో బ్రాండ్‌లను ఫోక్స్‌వ్యాగన్ కలిగి ఉంది. ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో స్వతహాగా వెంటో, పోలో, జెట్టా, పస్సాట్ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి కాకుండా ఫేటన్, బీటెల్ కార్లను సిబియూ రూట్‌లో దిగుమతి చేసుకొని విక్రయిస్తుంది.


Click it and Unblock the Notifications








