ఫోక్స్‌వ్యాగన్ నుంచి 2011 జెట్టా విడుదల - పూర్తి వివరాలు:

Volkswagen New Jetta
జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత్‌లో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'జెట్టా'లో కొత్తగా రిఫ్రెష్డ్ వేరియంట్ '2011 జెట్టా'ను కంపెనీ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభించనున్న కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్ కారు ప్రారంభ ధర రూ. 14.12 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కొత్త జెట్టా విడుదల నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత జెట్టా స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు సదరు మోడల్‌పై కంపెనీ రూ. 75,000 మేర డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టాలో ఎన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను పొందుపరచబడ్డాయి. లెథర్‌తో ప్యాక్ చేయబడిన స్టీరింగ్ వీల్, హ్యాండ్ బ్రేక్ అండ్ గేర్ లివర్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్, రియర్ ఏసి వెంట్స్, టచ్ స్క్రీన్‌తో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సిడి ప్లేయర్, ఆక్స్ ఇన్‌పుట్ సిస్టమ్, ఎనిమిది స్పీకర్లు అన్ని కూడా స్టాండర్డ్ ఫీచర్లుగా కొత్త జెట్టాలో లభించనున్నాయి.

సరికొత్త జెట్టా 2.0 లీటర్, 4 సిలిండర్ సిఆర్‌డిఐ ఇంజన్‌తో 140PS @ 4200rpm గరిష్ట శక్తిని మరియు 320 Nm @1750-2500 rpm గరిష్ట టార్క్‌ను కలిగి ఉంటుంది. ఇది 6-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్‌తో మ్యాన్యువల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఎలక్ట్రానికి స్టెబిలిటీ పోగ్రామ్ (ఈఎస్‌పి), ఎనిమిది ఎయిర్‌బ్యాగులతో పాటు వెనుక భాగంలోని మధ్య సీటులో అమర్చిన 3-పాయింట్ సీట్ బెల్ట్ కొత్త జెట్టాలో స్వాగతించదగిన ఫీచర్.

కొత్త జెట్టా క్యాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్, కాఫీ బ్రౌన్, డీప్ బ్లాక్ పెరల్, ప్లాటినమ్ గ్రే, సిల్వర్ లీఫ్ రంగుల్లో లభ్యమవుతుంది. ఇంకా ఇది ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్, హైలైన్ అనే మూడు వేరియంట్లలో, అన్ని వేరియంట్లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో లభిస్తాయి. కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ధరలు రూ. 14.12 లక్షలతో ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2011, 16:45 [IST]
English summary
German carmaker Volkswagen launched its all new 2011 Jetta sedan in Indian marker at a price of 14.12 lakhs (ex-showroom Delhi). The new version Jetta available in three variants namely the Trend line, the Comfort line and the High line will all be available in both Manual and Automatic Transmission options.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+