ఐపిల్ ఎడిషన్ 'వెంటో' కారును విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్

ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ "జెట్టా"లో కొత్త వేరియంట్‌ను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ఫోక్స్‌వ్యాగన్ జెట్టా 2008లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. 2010లో దాదాపు 2,500 జెట్ట కార్లు అమ్ముడయ్యాయి. ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల బ్లూ మోషన్ టెక్నాలజీతో కూడిన పస్సాట్ ప్రిమీయం లగ్జరీ సెడాన్‌ను భారత్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
డ్రైవర్ అలసటను గుర్తించి బ్రేక్ వేయమనే వార్నింగ్ సిగ్నల్‌ను ఇచ్చే "అటెన్షన్ అసిస్ట్" వంటి వినూత్న ఫీచర్లు తమ బ్లూ మోషన్ టెక్నాలజీలో ఉన్నాయని, ఈ టెక్నాలజీ పట్ల వినియోగదారుల స్పందనను గమనించిన తర్వాత ఇతర మోడళ్లలో కూడా బ్లూ మోషన్ టెక్నాలజీని ప్రవేశపెడతామని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డైరెక్టర్ మరియు బోర్డు సభ్యులు నీరజ్ గార్గ్ వెల్లడించారు. ఈ నెలలోనే పస్సాట్ డెలివరీలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఐపిఎల్ వేరియంట్‌లో విడుదలైన మిడ్-సైజ్ సెడాన్ వెంటో 1.6లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ. 7.24 లక్షలు(ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








