సియట్ బ్రాండ్‌ను భారత్‌కు పరిచయం చేయనున్న ఫోక్స్‌వ్యాగన్

భారత్‌లో మరిన్ని కొత్త కార్లను, బ్రాండ్లను విడుదల చేయడం ద్వారా ఫోక్స్‌వ్యాగన్ తన మార్కెట్ పరిమాణాన్ని, ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్పానిష్ బ్రాండ్ అయిన సియట్‌ను ఫోక్స్‌వ్యాగన్ దేశీయ వినియోగదారులకు పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.
సియట్ ఇప్పటికే తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్, మల్టీ యుటిలిటీ వెహికల్ మరియు ప్రీమియం సెడాన్‌లను కలిగి ఉంది. అయితే, ఇండియా వంటి కీలక మార్కెట్లో ఈ స్పానిష్ బ్రాండ్ ఎంత వరకూ నిలబడుతుందనేది ప్రశ్నార్థంగా మారింది. స్కొడా అందిస్తున్న అన్ని రకాల వేరియంట్లను సియట్ కూడా కలిగి ఉంది.
మరి ఈ పరిస్థిల్లో.. భారత్‌లో స్కొడా ఏర్పరుచుకున్నంత స్థిరమైన స్థానాన్ని ఈ స్పానిష్ బ్రాండ్ కూడా ఏర్పరుచుకోవాలంటే కాస్తంత సమయం పట్టే ఆస్కారం ఉంది. ప్రస్తుతం సియట్ గ్లోబల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లిబిజా, ప్రీమియం సెడాన్ ఎక్సియో మరియు క్రాసోవర్ అల్హాంబ్రా వంటి మోడళ్లను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








