ఫోక్స్‌వ్యాగన్ ఫేటన్ కారుపై రూ. 25 లక్షల డిస్కౌంట్

VW Phaeton
మార్కెట్ మందగించడంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాయి. దీనికితోడు పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వడ్డీ రేట్లు వాహన రంగంపై మరింత ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పేరుకుపోతున్న స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు మరియు కొత్త కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు కార్ల తయారీదారులు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. జర్మనీకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం అందిస్తున్న లగ్జరీ కారు 'ఫేటన్'పై ఏకంగా 25 లక్షల రూపాయల తగ్గింపు (డిస్కౌంట్)ను ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ8, మెర్సిడెస్ ఎస్-క్లాస్ వంటి లగ్జరీ కార్లకు పోటీగా వచ్చిన ఫోక్స్‌వ్యాగన్ ఫేటన్ మార్కెట్ పోటీని అంతగా తట్టుకులేకపోయింది. గతేడాది జనవరిలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఫేటన్ 18 నెలలు గడిచినా కేవలం 53 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో ఈ కారుపై రూ. 25 లక్షల డిస్కౌంట్‌ను ప్రకటించామని, కానీ దీని డెలివరీ ఒక నెల సమయం పడుతుందని ఢిల్లీలోని ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. ఫేటన్ 2002లో ప్రపంచ మార్కెట్లో విడుదలైంది. ఫోక్స్‌వ్యాగన్ ఫేటన్ మార్కెట్ ధర రూ. 77 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 25, 2011, 15:23 [IST]
English summary
Volkswagen India is now offering its Phaeton luxury car with a whopping cash discount of Rs.25 lakhs. The Phaeton is priced at Rs.77 lakhs in India and the discount offer will mean buyers of this luxury sedan will have to pay around Rs.52 lakhs to get their car on their drive way. The Volkswagen Phaeton is a luxury sedan that competes with cars such as the BMW 7-Series, Mercedes-Benz S-Class and the Audi A8.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+