అతి త్వరలోనే ప్రపంచపు అగ్రగామిగా ఎదగనున్న ఫోక్స్‌వ్యాగన్

ఒకప్పుడు ఆర్థిక మాంద్యం సమయంలో దాదాపు దివాళా తీసే స్థాయికి చేరిన జనరల్ మోటార్స్ ఇప్పుడు టొయోటాను అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే, తాజాగా.. ఫోక్స్‌వ్యాగన్ త్వరలోనే ఈ రెండు అగ్రగామి ఆటోమొబైల్ దిగ్గజాలను అధిగమించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోనుంది. ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ తమ చైర్మన్ ఫెర్డినాండ్ పీచ్ నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
వివిధ చిన్న పెద్దా ఆటోమొబైల్ కంపెనీలను తమలో విలీనం చేసకుంటూ ఫోక్స్‌వ్యాగన్ అతిపెద్ద ఆటో దిగ్గజంగా అవతరిస్తుంది. ప్రస్తుతం సంవత్సరంలో ఫోక్స్‌వ్యాగన్ అమ్మకాలు 13 శాతం పెరగి 8.1 మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే అతి త్వరలోనే ఫోక్స్‌వ్యాగన్ ప్రపంచపు అగ్రగామి కంపెనీగా నిలుస్తుంది.
ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో జనరల్ మోటార్స్ అమ్మకాలు ఈ సంవత్సరంలో కేవలం 8 శాతం మాత్రమే వృద్ధి చెంది 7.55 మిలియన్ యూనిట్లను విక్రయించవచ్చని అంచనా. కాగా.. టొయోటా అమ్మకాలు మాత్రం 9 శాతం క్షీణించి 7.27 మిలియన్ యూనిట్లకు పడిపోవచ్చనని ఇటీవలి మార్కెట్ అధ్యయనం వెల్లడిస్తోంది.


Click it and Unblock the Notifications








