ఈబే ఆక్షన్‌లో రూ. 30 లక్షలు పలికిన ఫోక్స్‌వ్యాగన్ పస్సాత్ కారు

Volkswagen Passat
విలాసవంతమైన కార్ల తయారీలో పేరుగాంచిన జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్.. ఇటీవల సరికొత్త బ్లూమోషన్ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేసిన 'పస్సాత్' కారు, ఆన్‌లైన్ విక్రయాలు జరిపే సంస్థ 'ఈబే' నిర్వహించిన వేలంలో దాదాపు రూ. 30 లక్షలుకు పైగా వెల పలికింది. సాధారణ మార్కెట్లో ఈ కారు అసలు ప్రారంభ ధర రూ. 20.80 లక్షలు మొదలుకొని గరిష్ఠంగా రూ. 25.65 లక్షల వరకూ ఉంటుంది. మరి ఇంత అధికంగా ధర పలకడానికి ఇందులో స్పెషల్ ఏంటయ్యా అంటే.. ఈ కారుపై అన్ని టీ20 క్రికెట్ జట్ల సంతకాలు ఉండటమే.. ఈబే ఇండియా ఇప్పటి వరకూ నిర్వహించిన ఆక్షన్‌లలో ఇదే అతిపెద్దది.

పది రోజుల పాటు జరిగిన ఈ వేలం మే 10వ తేదీన ముగిసింది. కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన క్రికెట్ ఔత్సాహికుడు సైదాస్ మల్లాడీ రూ. 30.13 లక్షలను వెచ్చించి ఈ కారును దక్కించుకున్నాడు. ఈ కారుతో అన్ని టీ20 జట్ల కెప్టన్లు ఆటోగ్రాఫ్ చేసిన ఓ క్రికెట్ బ్యాట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

కాగా.. ఫోక్స్‌వ్యాగన్ పస్సాత్ కారు ఆటోమేటిక్, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ ఆప్షన్లలతో డీజల్ వేరియంట్‌లో లభ్యమవుతుంది. బ్లూమోషన్ టెక్నాలజీలో ఉన్న స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రెక్యుపరేషన్ (బ్రేక్ వేస్తే బ్యాటరీ చార్జ్ అవ్వడం), డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అత్యంత ఇంధన సామర్థ్యం గల ఇంజన్ వంటి అధునాతన ఫీచర్లతో ఇది లభిస్తుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో తమ బ్లూమోషన్ టెక్నాలజీ ఓ కొత్త వరవడిని సృష్టించగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 25, 2011, 11:27 [IST]
English summary
Volkswagen Passat luxury car embellished with the signatures of all T20 cricket teams has been sold for over Rs 30 lakh on eBay India, making it the largest auction so far on the online market place.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+