ఛాకన్ ప్లాంటులో తొలి లక్షల ఉత్పత్తిని సాధించిన ఫోక్స్‌వ్యాగన్

VW One Lakh Car
కేవలం 18 నెలల్లోనే జర్మన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, పూణేలోని ఛాకన్ ప్లాంటులో మొదటి లక్ష కార్ల ఉత్పత్తిని పూర్తి చేసింది. శుక్రవారం కంపెనీ తన 1,00,000వ కారును ఈ ప్లాంటు నుంచి విడుదల చేసింది. ఛాకన్ ప్లాంటులో కంపెనీ అందిస్తోన్న హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ పోలో మరియు సెడాన్ వేరియంట్ వెంటో కార్లతో పాటు ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ కంపెనీ అయిన స్కొడా బ్రాండ్‌ కాంపాక్ట్ కారు ఫ్యాబియా మోడళ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

ఈ ప్లాంటులో 2009లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఛాకన్ ప్లాంటులో తొలుత ఫ్యాబియా కార్లను తయారు చేస్తుండగా, ఆ తర్వాతి కాలంలో పోలో, వెంటో కార్లు వచ్చి చేరాయి. ఈ సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రై లి అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. జాన్ ఛాక్కో మాట్లాడుతూ.. "ఇదొక ముఖ్యమైన మైలురాయి. కంపెనీ అభివృద్ధిలో తొలి దశ పూర్తయిందని చెప్పడాని ఇదొక గుర్తు. రెండవ దశలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్రవేశపెట్టడం వంటి ప్రణాళికలను చేస్తామ"ని తెలిపారు.

More from DriveSpark

Article Published On: Saturday, July 9, 2011, 10:45 [IST]
English summary
Germany auto major Volkswagen India on Friday rolled out the 100,000th car from its Chakan plant in Pune. Production started in Chakan plant since May 2009. The company makes variants of the VW Polo and Vento, as well as the Skoda Fabia at this plant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+