జూన్‌ నెలలో 166 శాతం పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ విక్రయాలు

Volkswagen Polo
జర్మనీకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంది. ఇతర విదేశీ కంపెనీలతో పోలిస్తే ఫోక్స్‌వ్యాగన్ విక్రయాలు అదరహో అనిపిస్తున్నాయి. గత నెలలో ఈ జర్మనీ కంపెనీ విక్రయాలు ఏకంగా 166 శాతం పెరిగాయి.

జూన్ 2011లో ఫోక్స్‌వ్యాగన్ 5,397 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 2,032 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడళ్లయిన కాంపాక్ట్ కారు పోలో మరియు సెడాన్ కారు వెంటోలకు లభిస్తున్న అవపూర్వ స్పందన కంపెనీ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచింది.

జూన్ నెల మొత్తం విక్రయాలలో కేవలం ఈ రెండు మోడళ్లే 5,136 యూనిట్లగా నమోదయ్యాయి. ఇకపోతే కంపెనీ ఇటీవలే బ్లూమోషన్ టెక్నాలజీతో విడుదల చేసిన తమ తొలి లగ్జరీ కారు ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్‌కు మంచి ఆదరణే లభిస్తోంది. జూన్ 2011లో కంపెనీ మొత్తం 137 పస్సాట్ కార్లను విక్రయించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

ఓవైపు ఇంధనం మరియు వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, జూన్ నెలలో తాము అత్యుత్తమ ప్రతిభను కనబరిచామని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా బోర్డ్ మెంబర్ మరియు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డైరెక్టర్ నీరజ్ గార్గ్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, July 1, 2011, 14:25 [IST]
English summary
German car maker Volkswagen India reported 166% increase in June'11 sales, Company sold 5,397 units as against 2,032 units in the same month last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+