ఏప్రిల్ నెలలో 7,000 కార్లను విక్రయించిన ఫోక్స్‌వ్యాగన్

అంతేకాకుండా ఫోక్స్‌వ్యాగన్ థింక్‌బ్లూ కాన్సెప్ట్‌తో పర్యవరణాన్ని రక్షిద్దాం అనే సందేశాన్ని పంపుతూ.. బ్లూమోషన్ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేసిన "పస్సాట్" కారుకు కూడా మంచి స్పందన లభించిందని కంపెనీ పేర్కొంది.
ఏప్రిల్ 8 నుంచి విక్రయాలు ప్రారంభమైన పస్సాట్ గత నెలలో 190 కార్లకు పైగా అమ్ముడైంది. విడుదలైన కొద్ది రోజుల్లో ఇంత మంచి స్పందన లభించడం ఆనందంగా ఉందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన వృద్ధిని కొనసాగించగలమని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా బోర్డ్ డైరెక్టర్ (ప్యాసింజర్ కార్స్) నీరజ్ గార్గ్ అన్నారు. పోలో, వెంటో విక్రయాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, ఇండియన్ ప్రిమీయర్ లీగ్‌తో స్పాన్సర్‌గా వ్యవరిస్తుండటంతో తమ బ్రాండ్ ఇమేజ్ మరింత విస్తృతంగా పెరిగిందని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








