ఫోక్స్‌వ్యాగన్ - సుజుకిల అలయన్స్ విడిపోనుందా..!?

సుజుకి మోటార్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ ఒసాము సుజికి తన బ్లాగులో జర్మన్ ఆటోమేకర్‌తో అలయన్స్‌కు సంబంధించిన పటిష్టమైన అవరోధాల గురించి ఓ జాబితాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు సంస్థల ఉన్నత యాజమాన్యాల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. తాము ఫోక్స్‌వ్యాగన్‌తో ఓ భాగస్వామిగా మాత్రమే సుజుకి భావిస్తుందే తప్ప ఫోక్స్‌వ్యాగన్ కింద పనిచేయాలని మాత్రం భావించడం లేదు. వాస్తవానికి సుజుకికు ఇప్పటికే సరిపడా టెక్నాలజీ ఉంది, కాబట్టి కొత్తగా ఫోక్స్‌వ్యాగన్ అవసరం లేదనేది విశ్లేషకుల భావన.
ఇటీవల ఓ జర్మన్ పత్రికకు ఫోక్స్‌వ్యాగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తమకు సుజుకి ఎంత మాత్రం సహకరించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఈ రెండు సంస్థ మధ్య దూరాన్ని మరింతగా పెంచాయి. దీనికి తోడు ఒసాము సుజుకి తన బ్లాగ్‌లో ఫోక్స్‌వాగన్ వద్ద ఉన్న టెక్నాలజీ మంచిదే అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు దాన్ని వినియోగించుకొవాలని తాము భావించడం లేదని, భారత్ వంటి క్లిష్టతరమైన మార్కెట్లలో ప్రవేశించాలని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇరు సంస్థల మధ్య కుదిరిన టెక్నాలజీ ఒప్పందానికి ఫోక్స్‌వ్యాగన్ మరియు సుజుకి కంపెనీలు డైవోర్స్ తీసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల వాదన.


Click it and Unblock the Notifications








