ఇండియాకు రానున్న ఫోక్స్‌వ్యాగన్ చౌక కారు 'అప్'

Volkswagen UP
జర్మన్ లగ్జీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఓ బుజ్జి కారును భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. మరికొద్ది వారాల్లో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఫోక్స్‌వ్యాగన్ తన చిన్న కారు 'అప్' (UP)ను ప్రదర్శించనుంది. భారత్‌లో ఈ కారు విడుదలైతే.. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న అత్యంత చౌక కారుగా అప్ నిలువనుంది. తొలుతగా ఇది యూరప్ మరియు అమెరికా మార్కెట్లలో అమ్ముడుకానుంది. అనంత భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.

ప్రస్తుతం భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ చిన్న కారు 'పోలో'. అర్బన్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా ఫోక్స్‌వ్యాగన్ అప్ కారును కంపెనీ రూపొందించింది. ఈ కారు 3.54 మీటర్లు పొడువును మరియు 1.64 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. ఇది మూడు డోర్లు మాత్రమే కలిగిన అయినప్పటికీ.. ఇందులో నలుగురు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. అయితే, ఇండియాలో విడుదల చేసే అప్ కారు నాలుగు డోర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

ముందువైపు ఇంజన్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ కలిగిన ఫోక్స్‌వ్యాగన్ అప్ 1-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 59 బిహెచ్‌పిల శక్తిని మరియు 74 ఎన్మ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభించనుంది. అంతేకాదండోయ్ అప్ కారు లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీనివ్వనున్నట్లు సమాచారం. భారత్‌లో మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ఆర్, హ్యుందాయ్ ఐ10, చెవర్లే బీట్ వంటి కార్లకు పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 23, 2011, 17:18 [IST]
English summary
Volkswagen has finally unveiled its latest UP small car. The new car is set to enter the Indian car market according to reports. The German carmaker unveiled the UP just days before the Frankfurt Auto Show. The UP will be Volkswagen's cheapest car once it is launched in India. We will have to wait for a while to buy it as it will be first sold in Europe and the Americas.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+