ముంబైలో కెమరాకు చిక్కిన ఫోక్స్‌వ్యాగన్ అప్

ఫోక్స్‌వ్యాగన్ అప్‌లో రెండు మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. ఇందుల మూడు డోర్లు కలిగినది ఒకటి, ఐదు డోర్లు కలిగినది మరొకటి. వాస్తవానికి భారత్‌లో కేవలం ఐదు డోర్లు కలిగిన అప్ కారును మాత్రమే ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేస్తుందని తొలుత భావించినప్పటికీ, ఇప్పుడు 3-డోర్ అప్ కారును కూడా దేశీయ మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ముంబైలో తీ-డోర్ ఫోక్స్‌వ్యాగన్ అప్ కారను రవాణా చేస్తుండగా కెమరాకు చిక్కిన ఫోటో ఇది. ఫోక్స్‌వ్యాగన్ అప్ భారత మార్కెట్లో విడుదలైతే, సదరు కంపెనీ నుంచి లభించనున్న అత్యంత చవక కారుగా ఇది నిలువనుంది. ఇది 3.54 మీ పొడవును, 1.64 మీ వెడల్పును కలిగి ఉండనుంది. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న చిన్న కారు పోలోకు దిగువను అప్ కారను ప్రవేశపెట్టనుంది.
ఫోక్స్‌వ్యాగన్ అప్ ముందువైపు ఇంజన్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ కలిగిన ఫోక్స్‌వ్యాగన్ అప్ 1-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 59 బిహెచ్‌పిల శక్తిని మరియు 74 ఎన్మ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభించనుంది. ఇంకా ఇది లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీనివ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








