వోల్వో భారీ లక్ష్యం: 2020 నాటికి 8 లక్షలు కార్ల అమ్మకాలు

Volvo S60
స్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో భారీ లక్ష్యాలను సిద్దం చేసుకుంది. రానున్న 2020 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఎనిమిది లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వోల్వో పేర్కొంది. గడచిన 2010లో వోల్వో ప్రపంచ వ్యాప్తంగా 3.74 లక్షల కార్లను విక్రయించింది.

కాగా.. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలు 4.30 లక్షలకు పెరగగలవని కంపెనీ అంచనా వేస్తున్నామని, 2020 నాటికి 8 లక్షల యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి గానూ కొత్తగా 10,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని వోల్వో ప్రకటించించింది. ప్రస్తుతం వోల్వోకు ప్రపంచవ్యాప్తంగా 24,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఈ కొత్త ఉద్యోగులలో ఎక్కువ మందిని చైనాలో నియమించుకోనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఏర్పడిన మార్కెట్ మందగమనం తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని, ఫిబ్రవరి-మార్చి 2012 వరకూ సరిపడా బుకింగ్‌లు ఉన్నాయని వోల్వో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ జాకాబీ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 29, 2011, 15:26 [IST]
English summary
Swedan based carmaker, Volvo aiming big towards their global strategies. Volvo is aiming at sell 8 lakh cars per annum across the globe by 2020. Volvo has sold 3.74 lakh units globally in 2010. To achieve this target, Volvo is planning hire 10,000 employees in near future.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+