2016 నాటికి ఆసియాలో 3వ అతిపెద్ద మార్కెట్‌గా భారత్: వోల్వో

ప్రస్తుతం భారత లగ్జరీ కార్ల మార్కెట్లో వోల్వో వాటా తక్కువగానే ఉందని, కానీ నెమ్మదిగా కంపెనీ వృద్ధి చెందగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్తులో తాము ఏస్థాయిలో ఉంటామో ఖచ్చితంగా చెప్పడం కష్టమే అయినప్పటికీ.. మార్కెట్ స్థితిగతులను బట్టి చూస్తే.. 2016 నాటికి చైనా, జపాన్‌ల సరసన భారత్ కూడా ఒకటిగా నిలబడగలదని ఆయన చెప్పారు. 2010లో భారత్ మార్కెట్లో వోల్వో 130 కార్లు విక్రయించింది. కాగా.. దేశంలోని మొత్తం లగ్జరీ కార్ల విక్రయాలు దాదాపు 15,000 యూనిట్ల వరకూ అమ్ముడయ్యాయి. 2020 నాటికి భారత లగ్జరీ కార్ మార్కెట్ డిమాండ్ 1,30,000 యూనిట్ల నుంచి 1,40,000 యూనిట్ల వరకు ఉండవచ్చునని వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పాల్ డి వోయిజ్స్ అన్నారు.
భారత్ మార్కెట్ ఇలాగే వృద్ధిని సాధిస్తూ ముందుకు పోతుందని, అలాగే ఇక్కడ తామకు కూడా మంచి గుర్తింపు లభించగలదని భావిస్తున్నామని ఆయన చెప్పారు. సరైన ధరకు ఉత్తమ నాణ్యమైన వాహనాలను ఉందజేయడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. భారత్‌లో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునే దిశగా.. వోల్వో ఆటో ఇండియా తాజాగా ఎస్60 అనే ప్రీమియం సెడాన్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే వీటి ధరలు రూ. 27 లక్షలు, రూ. 34 లక్షలు (ఎక్స్-షోరూం ఢిల్లీ)గా ఉన్నాయి. ఈ కార్లలలో ప్రపంచంలోనే తొలిసారిగా పాదచారులను గుర్తించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని (పెడస్ట్రియన్ డిటెక్షన్ సిస్టమ్) ఉపయోగించారు. దీని వల్ల రోడ్డుపై హఠాత్తుగా ఎవరైనా వ్యక్తులు, జీవులు లేదా వస్తువులు అడ్డు వచ్చినప్పుడు కారు దానిని గుర్తించి ఆటోమేటిక్‌గా దానంతట అదే బ్రేక్ వేసుకుంటుంది.


Click it and Unblock the Notifications








