2011లో 20 వేలకు పెరగనున్న లగ్జరీ కార్ మార్కెట్: వోల్వో

ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ లగ్జరీ కారు "వోల్వో ఎస్60"ను ఆయన చత్తీస్ఘడ్‌లో విడుదల చేశారు. లగ్జరీ కార్లకు భారత్ ఓ పటిష్టమైన మార్కెట్ అని, 2020 నాటికి మొత్తం ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో లగ్జరీ కార్ల వాటా 3 శాతానికి పెరిగి 1.5 లక్షల కార్లు ఆమ్ముడవుతాయని వోయిజ్స్ అంచనా వేశారు. గడచిన ఐదేళ్లలో లగ్జరీ కార్ సెగ్మెంట్ 0.16 శాతం నుంచి 0.60 శాతానికి చేరుకుందని, ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఇది 0.70 శాతానికి పెరిగిందని ఆయన వివరించారు.
2010లో భారత మార్కెట్లో వోల్వో 130 కార్లను విక్రయించింది. గత మూడేళ్ల క్రితం భారత్‌లోకి ప్రవేశించిన వోల్వో ఈ సంవత్సరం కొత్తగా బెంగుళూరు, చెన్నయ్, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్ నగరాల్లో డీలర్ షిప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం వోల్వోకు ఢిల్లీ, ముంబై, చండీగఢ్, కోయంబత్తూరు, హైదరాబాద్, కోచి, పూనెలలో డీలర్లున్నారు. వోల్వోకు ఢిల్లీ, ఎన్‌సీఆర్ మార్కెట్లు అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాలలో ముంబై, హైదరాబాద్ మార్కెట్‌లు ఉన్నాయి.
ప్రస్తుతం భారత్‌లో వోల్వో నుంచి ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎస్80, ఎస్60 అనే నాలుగు ప్రీమియం కార్లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








