సరికొత్త ఆటోమొబైల్ టెక్నాలజీని పరిచయం చేసిన వోల్వో

Pedestrian Detection System
లగ్జరీ వాహనాలను ఉత్పత్తి చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న స్వీడిష్ ఆటోమొబైల్ సంస్థ "వోల్వో" ఓ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. రోడ్డుపై హఠాత్తుగా వాహనాలకు అడ్డుగా వచ్చే పాదచారులను/వస్తువులను గమనించే ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని వోల్వో ఆవిష్కరించింది. వాహనాల్లో ఈ పరిజ్ఞాన్ని ఉపయోగించడం వల్ల రోడ్డుపై ఏదైనా అడ్డుగా ఉంటే దాని గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తూ ఓ ఆడియో అలారం విపిస్తుంది. ఆ అలారం విని వెంటనే డ్రైవర్ స్పందిస్తే సరే సరి.. లేకపోతే కారే స్వయంగా తనకు తానే ఆటేమోటిక్‌గా బ్రేకులు వేసుకొని అక్కడిక్కడే నిలిచిపోయి ప్రమాదాల నుంచి డ్రైవరును, ప్రయాణికులను కాపాడుతుంది.

కారు స్టార్ట్ అవ్వగానే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది. కారు 30 కిలోమీటర్ల వేగాన్ని మించగానే ఈ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. నానాటికీ అధికమవుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్ఠిలో ఉంచుకొని కాస్తయినా వాటిని అరికట్టాలనే ప్రయత్నంతో వోల్వో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో కూడా ప్రమాదం లేకపోలేదు. కారు ఉన్నట్టుంది హఠాత్తుగా రోడ్డుపై ఆగిపోతే వెనుక నుంచి వచ్చే వాహనం దానిని గమనించనట్లయితే ముందు ప్రమాదం తప్పి వెనుక ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. పైగా ఇది ఎక్కువ చీకటిగా ఉన్నా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా పనిచేయదు. ప్రస్తుతం కంపెనీ ఈ రెండు అంశాలపై మరోసారి ప్రయోగాలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, February 28, 2011, 17:11 [IST]
English summary
The Swedish automobile gaint Volvo had invented a new unique technology called 'Pedestrian Detection System'. With this system that automatically stops the car whenever it traces an object in front of it. To prevent the severe accidents company has developed this new technology.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+