బిఎమ్‌డబ్ల్యూ, బెంజ్ కార్ల కన్నా తక్కువ ధరకే వోల్వో కార్లు

వోల్వో ఆటో ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన థామస్ ఎర్న్‌బర్గ్ మాట్లాడుతూ.. పోటీ ధరల కోసం కొన్ని ఫీచర్లను తొలగించనున్నట్లు తెలిపారు. భారత్‌లో వోల్వో ఎలాంటి కార్లను ఉత్పత్తి చేయడంలేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని వోల్వో కార్లు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. భారత్‌లో వోల్వో కార్ల ధరలు రూ. 38 లక్షల నుంచి 55 లక్షల వరకూ ఉన్నాయి. అధిక దిగుమతి సుంఖం కారణంగా వోల్వో పోటీ ధరలకు ఉత్పత్తులను అందించ లేకపోతుంది. త్వరలో రానున్న వోల్వో చౌక కార్లు బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ధరల కన్నా తక్కువ ధరలకే లభించనున్నాయి.


Click it and Unblock the Notifications








