ఒక్క వారంలో 100 యూనిట్లకు చేరిన వోల్వో ఎస్60 బుకింగ్స్

ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. డీజిల్ వెర్షన్‌లో లభ్యమయ్యే డీ5 కినెటిక్ ధర రూ.27 లక్షలు గానూ, డీ5 సమ్మమ్ ధరను రూ.32 లక్షలు గాను.. అలాగే, పెట్రోల్ వెర్షన్ టీ6 సమ్మమ్ రూ.34 లక్షలుగాను నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. పెట్రోల్ వెర్షన్ టీ6 కారు 9.8 కిలోమీర్ల మైలేజ్‌ను, డీజిల్ వెర్షన్ డీ5 కారు 14.1 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారులో పెడస్టేరియన్ డిటెక్షన్ సిస్టమ్ అనే అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ కారు 35 కిలోమీటర్ల వేగాన్ని మించనప్పుడు పాదచారులు అకస్మాత్తుగా అడ్డు వస్తే, కారు దానంతట అదే ఆగిపోతుంది. కారు అధిక వేగంలో ఉన్నప్పుడు ముందున్న వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇది డ్రైవర్‌కు అందజేస్తుంది.


Click it and Unblock the Notifications








