ఐ-షిఫ్ట్ టెక్నాలజీ బస్సును ప్రవేశపెట్టిన వోల్వో

గేరు మార్పిడిపై డ్రైవర్ దృష్టిని మరల్చి రోడ్డపై డ్రైవర్ ఏకాగ్రతను పెంచుకునే విధంగా ఇందులో గేర్లను ఆటోమేటిక్‌గా మారేలా రూపొందించారు. ఈ గేర్లలో 12 ముందుకు (ఫార్వార్డ్), 4 వెనకకు (రివర్స్) ఉంటాయి. గేర్లను మ్యాన్యువల్‌గా మర్చడం ఇష్టం లేనివారు ఆటోమేటిక్ మోడ్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వేగం, రోడ్డు స్తితిగతులనుబట్టి ఆటోమేటిక్‌గా గేర్లు మారుతాయని వోల్వో పేర్కొంది. ఇంకా ఇందులో అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ సస్పెన్షన్, హైడ్రాలిక్ టెలిస్కోపిక్ టైప్ షాక్ అబ్‌సార్బర్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, డిస్క్ బ్రేక్స్, 600 లీటర్ల ఇంధన సామర్థ్యం గల మూడు ట్యాంకులు ఉన్నాయి. కాగా ఈ బస్సులో 53 మంది ప్రయాణించవచ్చు. ఈ బస్‌లతో ఇంధనం కూడా ఆదా అవుతుందని వోల్వో బసెస్ ఇండియా ఎండీ ఆకాశ్ పస్సే తెలిపారు. ఇక దీని ధర విషయానికి వస్తే దాదాపు కోటి పైమాటే.


Click it and Unblock the Notifications








