మారుతి సుజికి 'ఏ-స్టార్' కార్లపై కన్నేసిన వోక్స్‌వ్యాగన్

Volkswagen-Maruti Suzuki
భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజికి జర్మనీకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్‌తో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మారుతి సుజికి తయారుచేస్తున్న "ఏ-స్టార్" కార్లను వోక్స్‌వ్యాగన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించాలని మారుతి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు జరుగుతన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా మారుతి తన ఏ-స్టార్ కార్లను తొలుత వోక్స్‌వ్యాగన్‌కు విక్రయిస్తుంది. అనంతరం వోక్స్‌వ్యాగన్ ఏ-స్టార్ కార్లకు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి భారత్, ఆసియా మార్కెట్లలో కొత్త బ్రాండ్ పేరుతో విక్రయించనున్నట్లు సమాచారం. మారుతి మాతృసంస్థ అయిన సుజికి మోటార్ కార్పోరేషన్‌లో వోక్స్‌వ్యాగన్‌కు 20 శాతం వాటా ఉంది. సుజికి ఇప్పటివరకూ స్విఫ్ట్, రిట్జ్, ఎస్ఎక్స్4, గ్రాండ్ విటారా కార్లను అంతర్జాతీయంగా బ్రాండ్‌లుగా కలిగి ఉంది. ఈ ఒప్పందం కనుక విజయవంతమైతే మారుతికి ఏ-స్టార్ కారు ఐదవ గ్లోబల్ బ్రాండ్ కానుంది.

రెండేళ్లపాటు మారుతి ఏ-స్టార్ కార్లను సరఫరా చేయడంలో విజయవంతం కావడాన్ని చూసి వోక్స్‌వ్యాగన్ కూడా ఏ-స్టార్ కార్లపై కన్నేసినట్లుంది. మారుతి తన ఏ-స్టార్ కార్లను జపాన్‌కు నిస్సాన్ మోటార్స్‌కు సరఫరా చేసేది. నిస్సాన్ ఈ మోడల్‌ను కొద్దిగా మార్పులు చేసి "పిక్సో" అనే బ్రాండ్ నేమ్‌తో యూరప్‌లో ఉన్న స్వంత నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తుంది. అంతేకాకుండా.. పూర్తిగా మారుతి సుజికి తయారు చేస్తున్న ఆల్టో కార్ల మాదిరిగానే ఏ-స్టార్ కార్లు కూడా విదేశీ మార్కెట్లలో లభ్యం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 23, 2011, 10:27 [IST]
English summary
India's largest car maker Maruti Suzuki India will supply its latest compact car A-Star to Germany's auto gaint Volkswagen AG. The car, which will undergo some modifications and design changes, will be sold in India and Asian markets under a new brand name, according industry sources.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+