రూ. 20,000 మేర ప్రియం కానున్న ఫోక్స్‌వ్యాగన్ వెంటో డీజిల్

Volkswagen Vento
ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన భారత అనుబంధ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ మార్కెట్లో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'వెంటో' డీజిల్ వేరియంట్ కారు ధరను 2.2 శాతం పెంచాలని భావిస్తోంది. అధిక ఇన్‌పుట్ ధరల కారణంగా ఈ మోడల్ ధరను పెంచాల్సి వస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే పెట్రోల్ వేరియంట్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ వివరించింది.

కాగా.. పెట్రోల్ ధరలు రోజు రోజుకీ భగ్గమంటుండంతో వాహన చోదకులు పెట్రోల్ కార్లకు బదులు డీజిల్ కార్లపై మక్కువు చూపుతున్నారు. ఈ తరుణంలో కార్ల తయారీదారులు వివిధ డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటే, ఫోక్స్‌వ్యాగన్ మాత్రం వెంటో డీజిల్ వేరియంట్ ధరను పెంచడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో వెంటో డీజిల్ వేరియంట్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.24 లక్షల మధ్య అంది. అలాగే పెట్రోల్ వేరియంట్ వెంటో కారు ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.22 లక్షల మధ్య ఉంది.

గడచిన కొద్ది నెలలుగా పెరిగిన ఇన్‌పుట్ కాస్ట్ తమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఫలితంగా వెంటో డీజిల్ ధర పెంచక తప్పడం లేదని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా ప్రై. లి. బోర్డు సభ్యులు మరియు డైరెక్టర్, ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ నీరజ్ గార్గ్ తెలిపారు. పెట్రోల్ వేరియంట్ కార్ల విషయంలో ఇప్పటికే వినియోగదారులు పెరిగిన పెట్రోల్ ధరతో సతమతమవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ వేరియంట్ వెంటో కారు ధరను పెంచడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే.. జూన్ 30, 2011 వరకూ వెంటో డీజిల్ సెడాన్ కారును బుక్ చేసుకున్న వినియోగదారులకు ప్రస్తుత ధరతోనే ఈ కారు లభిస్తుందని కంపెనీ వివరించింది. అంతేకాకుండా.. వెంటో మోడల్‌‌లో ఎంపిక చేసిన పెట్రోల్ వేరియంట్‌లపై 6.99 వడ్డీరేటును జూన్ నెల నుంచి అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Monday, June 6, 2011, 16:21 [IST]
English summary
German carmaker Volkswagen India said it will hike the prices of the diesel variant of its mid-sized sedan Vento by 2.2 per cent from July 1 due to the rise in input costs. The petrol variants, however, will see no increase in price.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+