ఈ కారులో చోటు ఒక్కరికి మాత్రమే..!

బైక్‌పై వెళ్లడం బోర్ కొట్టేసిందా..! ట్రాఫిక్ జామ్‌లలో వాహనాల నుండి వెలువడే కాలుష్యం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందా..! అయితే ఇకపై ఇలాంటి సమస్యలను మర్చిపోవచ్చు. ఆటోమొబైల్ రంగంలో వినూత్నమైన కాన్సెప్ట్‌లను రూపొందించడంలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సాటి మరొకరు లేరనే చెప్పొచ్చు. ఫోక్స్‌వ్యాగన్ తాజా అద్భుత సృష్టి "సింగిల్ సీట్ కాన్సెప్ట్ కార్".

కేవలం ఒక్కరికి మాత్రమే చోటు ఉండే ఓ సింగిల్ సీట్ జీరో ఎమిషన్ కారును ఫోక్స్ వ్యాగన్ అభివృద్ధి చేస్తోంది. త్వరలో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఫోక్స్‌వ్యాగన్ ఈ సింగిల్ సీట్ కారును ప్రదర్శించనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ విభాగంలో ఇంత వరకూ ఇలాంటి ఓ కారును ఏ కంపెనీ విడుదల చేయలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కారు ధర 600 డాలర్లుగా ఉండొచ్చని అంచనా.

అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 30,000 వరకూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే.. ఓ టూ-వీలర్‌పై వెచ్చించే సొమ్ముతో ఈ బుజ్జి కారును సొంతం చేసుకోవచ్చు. పైగా ఎండ, వాన వంటి వాటి నుండి తప్పించుకొని హాయిగా ప్రయాణించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను ఫ్రాంక్ ఫర్ట్ ఆటో షోలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

Article Published On: Tuesday, August 23, 2011, 12:12 [IST]
English summary
Volkswagen is trying to push the boundaries of zero emission vehicles a bit further. The automaker is set to unveil its single seat concept car in Frankfurt auto show. The concept car is set to be a unique car for the fact that there is no vehicle in market in this category.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+