సింగిల్ సీట్ అర్బన్ కాన్సెప్ట్ కారు: ఫోక్స్‌వ్యాగన్ నిల్స్

"ఫోక్స్‌వ్యాగన్ నిల్స్" అనే పేరుతో ఓ సింగిల్ సీట్ కాన్సెప్ట్ కారును ఫోక్స్‌వ్యాగన్ ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఆవిష్కరించింది. ఇది అర్బన్ కాన్సెప్ట్ వెహికల్. నిల్స్ బ్యాటరీ పవర్‌తో నడిచే విద్యుత్ వాహనం (ఎలక్ట్రిక్ వెహికల్). 5.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో నడిచే ఈ ఆల్ట్రా-కాంపాక్ట్ కారు గరిష్ట రేంజ్ 65 కి.మీ. ప్రత్యేకించి నగర ప్రాంతాల కోసం దీన్ని రూపొందించారు.
నిల్స్ కారు కేవలం 11 సెకండ్లలోనే గంటకు 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం మూడు మీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ కారును ఎఫ్1 రేస్ కార్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని, కారులో ఒక్కరు మాత్రమే కూర్చుని ప్రయాణించేలా డిజైన్ చేశారు. ఈ కారు వెనుక భాగంలో ఎలక్టిక్ మోటార్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications








