హాట్ సమ్మర్‌లో చల్లటి పానీయాలందించే 'మొబైల్ కూలర్'

Thermocooler Car
మీ కారులో ఫ్రిడ్జ్ ఉందా..? అసలే వేసవి కాలం, ఎండలో ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నప్పుడు చల్ల చల్లగా ఏవైనా పానీయాలు తాగాలనుకున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లకు, షాపులకు పరుగులు తీసే బదులో కారులోనే ఎంచక్కా ఓ చిన్నసైజు ఫ్రిడ్జ్ ఉంటే.. ఈ హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు సేవించవచ్చు. వేసవి సెలవుల్లో ఎంచక్కా టూర్‌లకు వెళ్లేవారికి ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. పైగా దీనిని కనెక్ట్ చేయడం చాలా సులువు. కారులో మొబైల్ చార్జర్‌ను ఎలా కనెక్ట్ చేస్తామో ఈ థెర్మోకూలర్లను కూడా అంతే సులువుగా కనెక్ట్‌ చేయవచ్చు. అంతేకాకుండా దీనికి ఉన్న బెల్ట్ సాయంతో భుజానికి తగిలించుకొని మన వెంటే దీనిని ఎక్కడైనికైనా తీసుకవెళ్లవచ్చు. ఇది సుమారు 3-4 కిలోల బరువు ఉంటుంది.

ఈ మొబైల్ థెర్మో కూలర్లు కేవలం కూలింగ్ కోసం మాత్రమే కాకుండా.. వేడి పదార్థాలను వేడిగా ఉంచేందుకు కూడా ఇది పనికొస్తుంది. అంటే టూ ఇన్ వన్‌లా అన్నమాట. దీనికి బ్యాటరీ విద్యుత్ కూడా ఎక్కువ ఖర్చుకాదు. పైగా ఇది పెద్ద ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు. మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రాండ్‌ను బట్టి ఇది కనీసం రూ. 4,500 నుంచి రూ. 7,000 వరకూ ఉంటుంది. మరి ఇది ఎక్క దొరుకుతుంది, మార్కెట్లలో ఎంపిక చేసిన డీలర్ల దగ్గర, అలాగే ఆటోమొబైల్ యాక్ససరీస్ విక్రయించే కంపెనీలలో ఇది లభ్యమవుతుంది. ఇంకా అన్‌లైన్ ద్వారా కూడా ఈ మొబైల్ థెర్మో కూలర్లను కొనుగోలు చేయవచ్చు. మరికెందుకు ఆలస్యం వెంటనే షాపుకు వెళ్లి మీ బుజ్జి ఫ్రిడ్జ్‌ను తెచ్చుకొని ఈ హాట్ సమ్మర్‌ని కూల్‌గా ఎంజాయ్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 13, 2011, 12:41 [IST]
English summary
Mobile Console Coolers are available in the market for your cars. These coolers can help both ways like to transport chilled items as chilled and hot items as hot. It cools 20 degrees below ambient temp & heats to 65 degrees.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+