12 ఏళ్లలో 10 లక్షల సేల్స్ మార్క్‌ను దాటిన వ్యాగన్ఆర్ కారు

WagnoR
దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ వేరియంట్ కారు వ్యాగన్‌ఆర్‌ అమ్మకాలు పది లక్షల యూనిట్ల మార్కును అధిగమించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 1999 ప్రారంభమైన వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ కారు 12 ఏళ్లలో 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. మారుతి అందిస్తున్న మోడళ్లలో 10 లక్షల విక్రయాల మార్కును దాటిన నాలుగో మోడల్ వ్యాగన్ఆర్ కావడం విశేషం. గతంలో కంపెనీ టాప్ సెల్లింగ్ మోడల్ ఆల్టో, ఒకప్పటి రోడ్ కింగ్ ఎమ్800, మల్టీ పర్పస్ వ్యాన్ అయిన ఓమ్నీ కార్లు ఈ రికార్డును సాధించాయి.

ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్లో ఈ రికార్డు సాధించినందుకు తమకెంతో గర్వంగా ఉందని మరియు మరింత సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. దేశంలో ఆల్టో తర్వాత ఎక్కువగా అమ్ముడయ్యే కార్లలో వ్యాగన్‌ఆర్‌ తర్వాతి స్థానంలో ఉందని ఆయన వివరించారు. కొత్తగా వ్యాగన్‌ఆర్‌ మోడల్‌ను మార్చిన తర్వాత అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ మార్పు కోసం కంపెనీ మొత్తం రూ. 290 కోట్లను వెచ్చించింది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాగన్ఆర్ కారు ధర రూ. 3.36 కోట్ల నుంచి రూ. 4.24 కోట్లు (ఎక్స్‌-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఇది 998 సీసీ మోడల్‌ పెట్రోల్‌, సీఎన్‌జీ, ఎల్‌పీజీ వేరియంట్లలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 16, 2011, 11:06 [IST]
English summary
Maruti Suzuki India has reported that the sales of the Wagon R hatchback had crossed the 10 lakh mark after its launch 12 years ago. The Wagon R is the fourth model in Maruti Suzuki's line-up to cross the coveted sales milestone after the Maruti 800, Alto and Omni van.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+