భారత్ ఆటో రంగంపై దృష్టిని సారించిన బఫెట్

ఇప్పటికే ఈ రంగంలో ఎన్నో కంపెనీలు తమ స్థానాన్ని పదిలపరుచుకున్నాయని, వాటిల్లో అభివృద్ధి చెందేందుకు వీలున్న మంచి కంపెనీలకు పెట్టుబడులు అందించేందుకు యోచిస్తున్నామని, ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని ఆయన అన్నారు. కాగా, చైనా కేంద్రంగా కార్లను తయారు చేస్తున్న బివైడి కో లిమిటెడ్‌లో బఫెట్ నిర్వహిస్తున్న బార్క్‌షైర్ హాత్‌వే 10 శాతం వాటాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రీచార్జబుల్ బ్యాటరీలను, సెల్‌ఫోన్ల విడిభాగాలనూ కూడా తయారు చేస్తోంది. దాదాపు 200 బిలియన్ డాలర్లకు పైగా విస్తరించిన తన సామ్రాజ్యానికి ఇంకా వారసుడిని నిర్ణయించని బఫెట్ ఆ సమయం ఇంకా రాలేదని వ్యాఖ్యానించడం విశేషం. బార్క్‌షైర్ ప్రధాన వ్యాపారమైన బీమా రంగాన్ని అజిత్ జైన్ విజయవంతంగా నిర్వహిస్తుండడంతో ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.
బార్క్‌షైర్ ప్రధాన వాటాదారుగా వున్న ఐఎస్‌సిఎఆర్ మెటల్ వర్కింగ్ భారత సబ్‌సైడరీ సంస్థ ట్యాగు టెక్ సంస్థను సందర్శించేందుకు బఫెట్ బెంగళూరును సందర్శించారు. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ధనవంతుడిగా ఫోర్బ్స్ పత్రిక గుర్తించిన బఫెట్ భారత పర్యటనలో భాగంగా బార్క్‌షైర్ ఇన్స్యూరెన్స్ అమ్మకాలకు సంబంధించిన పోర్టల్‌ను సైతం ప్రారంభించనున్నారు. గురువారం నాడు భారత వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, సావిత్రీ జిందాల్, శశి, రవి రూయా, అజీం ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి తదితరులతో చర్చలు జరపనున్న సంగతి తెలిసిందే. ఆపై బార్క్‌షైర్ పాలసీదారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.


Click it and Unblock the Notifications








