ప్రపంచ కప్ గెలిస్తే.. జట్టులోని ప్రతి ఒక్కరికి కారు ఫ్రీ..!

Hyundai Verna RB
క్రికెట్ ప్రపంచ కప్‌ 2011లో భారత జట్టు గెలవాలని యావత్ దేశం కోరుకుంటుండగా.. జట్టుకు మరింత ఉత్సాహాన్ని అందించేదుకు దేశపు రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ భారత జట్టు ఆటగాళ్లకు మోగా ఆఫర్‌ను ప్రకటించింది. 28 ఏళ్లుగా వేచి చూస్తున్న ఈ క్రికెట్ మహా సంగ్రామంలో భారత జట్టు గెలిస్తే ప్రతి ఆటగాడికి ఓ సరికొత్త వెర్నా ఆర్‌బి కారును బహుకరిస్తామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) ప్రకటిచింది.

ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ శనివారం జరుగుతున్న శ్రీలంక-ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు గెలవాలని కోరుకుంటున్నామని, ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే.. జట్టులోని ప్రతిఒక్కరికి ఇంకా మార్కెట్లోకి కూడా విడుదల కాని సరికొత్త వెర్నా వేరియంట్‌ కారును అందిస్తామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ హెచ్.డబ్ల్యూ. పార్క్ చెప్పారు.

కొరియాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ అయిన హ్యుందాయ్ మోటార్ ప్రపంచ కప్ 2011కు అధికారిక కార్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యతో హ్యుందాయ్ ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మరో నాలుగేళ్ల పాటు హ్యుందాయ్ ఐసీసీతో సహకరించనుంది. ఈ ఒప్పందం 2015 వరకూ కొనసాగనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 2, 2011, 11:50 [IST]
English summary
Country's second largest car maker Hyundai Motor India Limited (HMIL), the official Car Partner of the Cricket World Cup 2011, announced that all the members of the Indian Cricket team are set to win the all-new Hyundai Verna if they win the World Cup.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+