కంపెనీ యూనియన్ ఎన్నికలను బహిష్కరిస్తాం..: మారుతి వర్కర్లు

కార్మికుల పాత డిమాండ్లకు అదనంగా.. ఉద్యోగం నుంచి తొలగించిన 11 మంది వర్కర్లను తిరిగి తీసుకోవాలనే ప్రతిపాదనను చేర్చారు. మానేసర్ ప్లాంటుకు కొత్త యూనియన్ కావాలని, ప్రస్తుతం ఉన్న మారుతి ఉద్యోగ్ కామ్‌గర్ యూనియన్ (ఎమ్‌యూకేయూ)లో భాగంగా ఉండేందుకు తాము సిద్ధంగా లేమని కుమార్ తెలిపారు. తమ వెనుక ఎలాంటి రాజకీయ యూనియన్ లేదని, స్వతంత్రంగానే మానేసర్ ప్లాంటులో కొత్త యూనియన్ కోసం పోరాడుతున్నామని, తమ డిమాండ్లను యాజమాన్యం అంగీకరిస్తే వెంటనే ఈ సమ్మెను విరమిస్తామని కార్మికులు అంటున్నారు.


Click it and Unblock the Notifications








