ఈ దీపావళికి మీరు ఏ కారు కొంటున్నారు..?

Deepavali Best Cars
పండుగలనేవి శుభదినాలకు ప్రతీక. అందుకే చాలా మంది ప్రజలు పండుగ రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. అలా ఆ రోజున కొనుగోలు చేసే వాహనాల వలన తమకు అంతా మంచే జరుగుతుందనేది వారి నమ్మకం. అయితే, మరికొద్ది రోజుల్లో వెలుగు జిలుగుల దీపావళి పండుగ రాబోతుంది. మరి ఈ పండుగ నాడు మీరే వాహనం కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పలు వాహన సంస్థలు, డీలర్లు వాహనాలపై భారీ డిస్కౌంట్లను, నగదు ప్రోత్సాహకాలను, వివిధ వినూత్న పథకాలను ప్రవేశపెట్టి కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే వాహనాలను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ సీజన్‌లో వాహనాలను కొనుగోలు చేయడం వలన శుభం కలగడంతో పాటు మీ వాహన బడ్జెట్‌లో కొద్దిపాటి మిగులు (సేవింగ్స్) కూడా లభించినట్లు అవుతుంది.

దీపావళి పండుగ నేపథ్యంలో, మారుతి సుజుకి, టొయోటా, హోండా, హ్యుందాయ్, స్కొడా, ఫోర్డ్ మరియు టాటా వంటి దాదాపు అన్ని కార్ల కంపెనీలు కూడా తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లను, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఫోక్స్‌వ్యాగన్, మారుతి సుజుకి, రీనాల్ట్, స్కొడా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి మరికొన్ని కంపెనీలు పరిమిత సంఖ్యలో లిమిటెడ్ ఎడిషన్, సెలబ్రేష్ ఎడిషన్, ఫెస్టివల్ ఎడిషన్ అంటూ అధనంగా జోడించబడిన ఫీచర్లు కలిగిన వాహనాలను అందిస్తున్నాయి.

అలాగే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు కూడా తక్కువ డౌన్‌పేమెంట్ పథకాలను, ఆకర్షనీమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఆఫర్లు అక్టోబర్ నెలాఖరు వరకూ కొనసాగనున్నాయి. అంతేకాకుండా.. ఉచిత ఇన్సూరెన్స్, సగం ధరకే ఇన్సూరెన్స్, ఎక్సేంజ్ బోనస్, పెట్రోల్ ఆఫర్స్, లక్కీ డ్రాలు, గోల్డ్ కాయిన్ ఆఫర్స్ వంటి ఎన్నో వినూత్నమైన, విశిష్టమైన ఆఫర్లను కంపెనీలు/డీలర్లు అందిస్తున్నాయి. వీరంతా కూడా ప్రాంతాన్ని బట్టి, కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఫెస్టివ్ డిస్కౌంట్ ఆకర్ష్ మంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.

వీరి ఉద్దేశ్యం కేవలం ప్రజల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవడం మాత్రమే కాదు. తక్కువ ధరకు విలువైన సేవలు/ఉత్పత్తులను అందించాలనేది కూడా మరికొందరి ఉద్దేశ్యం. వివిధ కంపెనీలు, డీలర్లు ఆఫర్ చేస్తున్న ప్రోత్సాహకాలు, ఆఫర్ల గురించి మేము ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇదివరకటి కథనాల్లో మా విలువైన పాఠకులతో పంచుకోవడం కూడా జరిగింది. మరి ఆలస్యం చేయకుండా, ఆఫర్లు ముగియక ముందే మీ డ్రీమ్ కారును సొంతం చేసుకుని ఈ రంగుల దీపావళిని మరింత కాంతివంతంగా జరుపుకోండి.

పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలతో..
మీ వన్ఇండియా

More from DriveSpark

Article Published On: Friday, October 14, 2011, 13:40 [IST]
English summary
Diwali is around the corner, in this festive season car companies like Maruti Suzuki, Toyota, Honda, Hyundai, Skoda, Ford, Tata and all other leading brands are offering festive discounts on their cars. These companies are also providing the other offers like free insurance, exchange bonus, lucky draws and lot more for buyers in this festival season 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+