హ్యుందాయ్ ఇయాన్ గురించి మరింత తాజా సమాచారం

Hyundai Eon
స్మాల్ కార్ లవర్స్‌ను ఎంతగానో ఊరిస్తున్న హ్యుందాయ్ ఇయాన్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసేందుకు మా వన్ఇండియా ఆటోమొబైల్ సిద్ధంగా ఉంది. ఇటు ఇంటర్నెట్‌లోనూ అటు పత్రికల్లోనూ హల్ చల్ చేస్తున్న ఈ బుజ్జి కారు మరో రెండు రోజుల్లో దేశీయ విపణిలోకి రానున్న సంగతి తెలిసిందే.

హ్యుందాయ్ ఇయాన్ చిన్న కారును ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో, ఆరు వేరియంట్లలో కంపెనీ విడుదల చేయనుంది. ఇది వైట్, బ్లాక్, రెడ్, సిల్వర్, గ్రీన్ మరియు గ్రే రంగులలో లభ్యమవుతుంది. ఇంకా.. డి-లైట్, డి-లైట్ (ఓ), ఎరా, మాగ్నా, మాగ్నా (ఓ), స్పోర్ట్జ్ అనే ఆరు వేరియంట్లలో విడుల కానుంది.

ఈ చిన్న కారు బేస్ వేరియంట్ ధర రూ.2.75 లక్షల గానూ, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.2.75 లక్షలు గానూ ఉండొచ్చని అంచనా. ఇది లీటరుకు 21.1 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది. హ్యుందాయ్ ఇయాన్ చిన్న కారును కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన ఫ్లూయిడిక్ వెర్నా సెడాన్ మోడల్ ద్వారా స్ఫూర్తి పొంది రూపొందించినట్లుగా అనిపిస్తుంది.

హ్యుందాయ్ ఇయాన్ టాప్-ఎండ్ వేరియంట్ మోడల్‌లో ఇంటీరియర్స్‌లో భాగంగా సరికొత్త మ్యూజిక్ సిస్టమ్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, సెంట్రల్ లాకింగ్, ఏసి, పవర్ విండోస్ మరియు పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇక ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే.. క్రోమ్ ఫినిషింగ్ కలిగిన ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ ల్యాంప్స్, పొడవైన టెయిల్ ల్యాంప్స్, కారు బాడీ కలర్‌లోనే ఉండే డోర్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్‌లా కనిపించేలా ఉండే వీల్ కవర్స్ కూడా ఉండనున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 11, 2011, 15:49 [IST]
English summary
The much awaited Hyundai Eon will hit the Indian roads on the 13th October. The base model of Hyundai Eon is expected to be priced at Rs 2.75 lacs (Ex-showroom) while the topend variant at Rs 3.75 lacs. Here is the some more features of this Compact Car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+