శ్రీలంకను చూసి ఏం భారత్ నేర్చుకోవాలి..?

Sri Lanka - India
పర్యావరణ విషయంలో శ్రీలంకను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. పరిమాణంలో చిన్న దేశమే అయినప్పటికీ పర్యావరణాన్ని రక్షించుకోవడంలో పెద్ద ఎత్తునే ప్రయత్నాలు చేస్తుంది. మన దేశంలో జనభా పెరుగుతున్నంత వేగంగా కార్లు కూడా పెరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదేమో! కార్ల వినియోగం నానాటికీ పెరిగిపోతుండటంతో పర్యావరణ కాలుష్యం కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

సరే, ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే.. దిగుమతి చేసుకునే వాహనాలపై శ్రీలంక ప్రభుత్వం కఠినమైన పన్ను విధానాన్ని ఆచరిస్తోంది. అదేంటంటే.. హైబ్రిడ్ కార్లపై దిగుమతి సుంఖం కేవలం 50 శాతమ మాత్రమే వసూలు చేస్తుంటే.. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే కార్లపై దిగుమతి సుంఖాన్ని ఏకంగా 450 శాతానికి పెంచింది. ఫలితంగా ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో శ్రీలంక 5.36 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను ఆదా చేసుకోగలిగింది.

ఈ భారీ దిగుమతి సుంఖాల కారణంగా ఇటీవలి కాలంలో అక్కడ హైబ్రిడ్ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. శ్రీలంకలో హైబ్రిడ్ కార్ల ధరలు దాదాపు శిలాజ ఇంధనాలతో నడిచే కార్ల ధరలకు సమానంగా ఉంటాయి. కానీ భారత్‌లో మాత్రం.. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల కన్నా ఇవి 70 శాతం నుంచి 100 శాతం వరకూ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా.. హైబ్రిడ్ కార్లకు కావాల్సిన సరైన మౌలిక సదుపాయాలు మనదేశంలో అంతంత మాత్రంగా ఉన్నాయి.

అందవల్లనే భారత్‌లో హైబ్రిడ్ కార్లు పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. ఇంధనాన్ని ఇలానే వినియోగిస్తూ పోతుంటే భవిష్యత్తులో ఈ వాహనాల వినియోగం ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంకలో పటిష్టమైన ఆటోమొబైల్ రంగం లేదు. కానీ మనదేశంలో ఉంది. ఏదేమైనప్పటికీ.. మిగిలిన విషయాలు అటుంచితే, పర్యావరణ పరిరక్షణ విషయంలో శ్రీలంక పాటిస్తున్న విధానాలను మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 4, 2011, 13:33 [IST]
English summary
The Srilankan government green policy for car import given good note for the world. The Lankan government implemented a new car import duty policy last January. It is implemented for imported vehicles this year with just 50% duty on hybrid vehicles and up to 450% on vehicles running on climate change causing fossil fuel driven vehicles. Between January and May 2011, Sri Lanka saved 5.36 crore liters of petrol and diesel because of increase in sale of hybrid vehicles, which cost almost same as conventional vehicles there.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+