సరికొత్త హోండా సిటీ సెడాన్‌లో కొత్త ఏంటీ..?

2012 Honda City
హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ బుధవారం సరికొత్త "2012 హోండా సిటీ" సెడాన్ కారును ఆకర్షనీయమైన ధరకే విడుదల చేసిన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. హోండా కేవలం రూ.6.99 లక్షలకే కార్పేరేట్ (బేస్) వేరియంట్‌ను ప్రవేశపెట్టి ఈ సెగ్మెంట్లోని పలు ఇతర మోడళ్లకు పెను సవాల్ విసరింది. కొత్త 2012 హోండా సిటీ సెడాన్‌లో చేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి:

ఫ్రంట్ క్రోమ్ గ్రిల్: సరికొత్త క్రోమ్ డిజైన్ కలిగిన ముందువైపు గ్రిల్, మంచి స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, కారు లోపల డోర్ హ్యాండిల్స్, ఏసి కంట్రోల్ నాబ్స్, బూట్ లిడ్‌‌లు క్రోమ్ కోటింగ్‌ను కలిగి ఉండి కారుకు సరికొత్త అందాన్ని ఇస్తాయి.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్: 2012 హోండా సిటీ వీ ఎమ్‌టి, వీ ఏటి వేరియంట్లలో సన్‌రూఫ్ ఆప్షన్ లభిస్తుంది (వీటి ధరలు వరుసగా రూ.9.50 లక్షలు, రూ.10.22 లక్షలు). ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ టిల్ట్ (వంపు), స్లైడ్ (జారు) ఫంక్షన్లను కలిగి ఉంటుంది.

క్రూయిజ్ కంట్రోల్: 2012 హోండా సిటీ వీ వేరియంట్ క్రూయజ్ కంట్రోల్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. దీని కంట్రోల్స్ స్టీరింగ్ వీల్ కుడి వైపు ఉండే స్పోక్‌పై ఉంటుంది. అలాగే, ఎస్ మరియు వీ వేరియంట్లలో స్టీరింగ్ వీల్ ఎడమ వైపు ఉండే స్పోక్‌పై ఆడియో కంట్రోల్స్ ఉంటాయి.

న్యూ ఫ్రంట్ బంపర్: కొత్త హోండా సిటీ సెడాన్‌లో ఉపయోగించిన సరికొత్త బంపర్, సరికొత్త డిజైన్‌తో రూపొందించబడిన ఫాగ్ ల్యాంప్స్, స్వల్పంగా మార్పులు చేర్పులు చేయబడిన రియర్ బంపర్, రిఫ్లెక్టర్స్, రియర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మరో ప్రధాన ఆకర్షనగా నిలువనున్నాయి.

10-స్పోక్ అల్లాయ్ వీల్స్: కొత్త హోండా సిటీ వీ వేరియంట్ 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ డిజైన్‌తో లభిస్తుంది. ఇది కారుకు మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది. ఎస్ వేరియంట్ పాత 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ డిజైన్, ఈ వేరియంట్‌లో వీల్ క్యాప్స్‌తో కూడిన రెగ్యులర్ స్టీల్ వీల్ డిజైన్ ఉంటుంది.

ఓవిఆర్ఎమ్‌లు: టర్నింగ్ ఇండికేటర్లు కలిగిన సరికొత్త ఎలక్ట్రిక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్‌లు).

ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్: బ్లూ బ్యాక్‌లైట్ కలిగిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కారులో సరికొత్త లుక్‌ను ఇస్తుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ డిజైన్ ఇదివరకటి హోండా సిటీ మాదిరిగానే ఉంటుంది.

గ్రౌండ్ క్లియరెన్స్: కొత్త 2012 హోండా సిటీ సెడాన్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కంపెనీ కాస్తంత విస్తరించింది. పాత సిటీ సెడాన్‌తో పోలిస్తే కొత్త సిటీ సెడాన్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను 5 మి.మీ. (165 మి.మీ) మేర పెంచడం జరిగింది. అలాగే కొత్త బంపర్ల కారణంగా దీని పొడవు, ఎత్తులు కూడా స్వల్పంగా పెరిగాయ

ఇవేకాకుండా కార్పోరేట్ వేరియంట్‌లో బ్లాక్ ఇంటీరియర్స్, ఇతర వేరియంట్లలో బీజ్ ఇంటీరియర్స్, రెండు సరికొత్త కలర్ ఆప్షన్స్, మైలేజ్ (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ 16.8 కెఎమ్‌పిఎల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ 15.6 కెఎమ్‌పిఎల్).

More from DriveSpark

Article Published On: Thursday, December 15, 2011, 16:09 [IST]
English summary
The much awaited 2012 Honda City sedan has been unveiled by Honda. The new sedan as we had said earlier is a cosmetic facelift to the existing model. However there are no changes in the technical specifications. The new city has been launched in Delhi and here are the details on the new car. It will get two brand new colours - Carnelian pearl red and Sparkling brown metallic.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+