కొత్త టొయోటా ఇన్నోవా క్రిస్టాలో కొత్త ఏంటి..!?

Toyota Innova Crysta
టొయోటా అందిస్తున్న బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) 'టొయోటా ఇన్నోవా'లో ప్రవేశపెట్టిన కొత్త వేరియంట్‌ 'టొయోటా ఇన్నోవా క్రిస్టా'లో ఎన్నో విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్, ఇవి కేవలం 1,000 యూనిట్లు మాత్రమే తయారవుతాయి. ఇన్నోవా క్రిస్టా తెలుపు (సూపర్ వైట్) రంగులో ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.

ఇది వీఎక్స్ గ్రేడ్ 2.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో భారత్ స్టేజ్ 3 (BS-III), మరియు స్టేజ్ 4 (BS-IV) ఆప్షన్లలో ఇది లభ్యమవుతుంది. క్రిస్టల్ (స్వచ్ఛమైన, పారదర్శకమైన గాజు లాంటి పదార్థం) అనే పదం నుంచి టొయోటా క్రిస్టా అనే పేరును ఉత్పన్నం చేశారు. క్రిస్టల్ విలాసానికి ప్రతీక. అలాగే, ఈ ప్రీమియం ఎమ్‌పివి కూడా అన్ని విలాసాలకు ధీటుగా ఉంటుంది.

టొయోటా ఇన్నోవా క్రిస్టా ఫీచర్లు:

* స్మోక్‌డ్ అల్లాయ్ వీల్స్ - క్లాసీ స్మోక్‌డ్ అల్లాయ్ వీల్స్ మంచి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.
* బాడీ గ్రాఫిక్స్ - క్రిస్టల్ డిజైన్‌తో కూడిన ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ విశిష్టమైన స్టైల్‌ను ఇస్తుంది.
* డ్యూయెల్ టోన్ లెథర్ సీట్ కవర్ - విలాసవంతమైన అనుభూతి కోసం ఈ వాహనంలో సీట్ కవర్లను డ్యూయెల్ టోన్ లెథర్‌తో రూపొందించారు. ఎంతో సౌకర్యంగా ఉండి సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తాయి.
* రియర్ రూఫ్ స్పాయిలర్ - వెనుకపై అద్దంపై కాస్తంత ముందుకు వచ్చినట్లుగా ఉండే 'రియర్ రూఫ్ స్పాయిలర్' కారు వెనుక వైపు నుంచి మరింత అదనపు లుక్‌ను ఇస్తుంది.
* డార్క్ వుడ్ ప్యానెల్ - కారు లోపలి భాగంలో ఉండే ప్యానెల్ డార్క్ ఉడ్ కలర్ ఉండి, ఇన్నోవా క్రిస్టా లోపలి ఇంటీరియర్స్ లగ్జరీ కార్లలోని ఇంటీరియర్స్‌ను మరిపిస్తాయి.
* మఫ్లర్ కవర్ - ద్విచక్ర వాహనాల మాదిరిగా, కారు వెనుక భాగంలో ఉండే సైలెన్సర్‌ను కప్పిఉంచే మఫ్లర్ కవర్ మంచి లుక్‌తో సైలెన్సర్‌కు రక్షణను కూడా ఇస్తుంది.
* ఫ్లోర్ మ్యాట్స్ - కారులోపల కాళ్ల కింద వేసుకునే ఫ్లోర్ మ్యాట్స్ క్లాసీ లుక్ ఉండే, కారు లోపలి ఇంటీరియర్స్‌తో మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేశారు.

టొయోటా ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ ఎమ్‌పివి కేవలం అక్టోబర్ 2011 వరకూ మాత్రమే విక్రయించబడుతుంది. ఆ తర్వాత సొంతం చేసుకోవాలనుకున్న దొరకదు. భారత మార్కెట్లో టొయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ. 13.13 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ ఇన్నోవా క్రిస్టాను బుక్ చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Friday, August 12, 2011, 14:17 [IST]
English summary
The Toyota Innova is one of the most successful MPVs in India and Toyota is adding to its glitz by launching a new limited edition model called the Innova Crysta. The Crysta will be a limited edition model and will be equipped with several luxury features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+