ఎవరి వద్ద ఎక్కువ కార్లున్నాయ్.. సల్మాన్ లేదా షారుఖ్..!?

షారుఖ్ హ్యుందాయ్ మోటార్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నప్పటికీ బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ కార్లంటే భలే ఇష్టమట. విదేశీ లగ్జరీ కార్లపై షారుఖ్‌కు కాస్తంత మోజు ఎక్కువనే చెప్పాలి. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (ధర రూ. 1.25 కోట్ల పైమాటే), బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ (ధర రూ. 85 లక్షలు), సూపర్ లగ్జరీ సెడాన్ ఆడి ఏ6, ఒక ల్యాండ్ క్రూజర్, మరో బ్లూ రంగు రోల్స్ రాయిస్, తెలుపు రంగు కాంటి జిటి, బిఎమ్‌డబ్ల్యూ కన్వెర్టబుల్ కార్లు షారుఖ్ సొంతం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే బుగాటి వెరాన్ కారుపై కూడా మన సిక్స్ ప్యాక్ సల్మాన్ ఖాన్ కన్నేశాడట.
మన షారుఖ్ కేవలం కార్ల ప్రియుడు మాత్రమే కాదండోయ్.. తన ప్రియమైన వారి కోసం కూడా లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చేస్తాడు. ఇటీవలే షారుఖ్ తన పిల్లలు ఆర్యన్, సుహానాలకు ఓ సరికొత్త ఆడి ఏ6 కారును (ప్రారంభ ధర రూ. 38 లక్షలు) బహుమతిగా ఇచ్చడట. అంతకు ముందు తెలుపు రంగు మెర్సిడెస్ బెంజ్ ఎస్350 కారును తన ఫిల్మ్ డైరక్టర్ ఫరా ఖాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. తన సినిమా ఓమ్ శాంతి ఓమ్ ఘన విజం సాధించడంతో షారుఖ్ ఈ బహుమతిని ఇచ్చాడట.
ఇక మన కండల వీరుడు సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. సల్మాన్‌కు కూడా బిఎమ్‌డబ్ల్యూ కార్లంటే చాలా ఇష్టం. సల్మాన్ వద్ద నాలుగు బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లున్నాయట. వీటితో పాటు సల్లూ భాయ్ వద్ద ఒక లెక్సస్, ఒక ల్యాండ్ క్రూజర్, మరో మెర్సిడెస్ బెంజ్ కార్లున్నాయి. ఇటీవలే సల్మాన్ సరికొత్త ఆడి ఏ8 లగ్జరీ కారును కూడా కొనుగోలు చేశాడట. కార్ల విషయంలో ఇద్దరికీ బిఎమ్‌డబ్ల్యూ అంటే ప్రాణం. మరి ఎవరి వద్ద బెటర్ కార్ కలెక్షన్ ఉందో ఖచ్చితంగా నిర్ధారించి చెప్పడం కష్టం. కాబట్టి ఆ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి ఎవరి వద్ద బెటర్ కలెక్షన్ ఉన్నాయో..?


Click it and Unblock the Notifications








