ఆడి ఇండియా జనవరి విక్రయాలు అదుర్స్

Audi
జర్మనీకు చెందిన ప్రమఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి అనుబంధ సంస్థ 'ఆడి ఇండియా' ఈ ఏడాది జనవరి విక్రయాలలో భారీ వృద్ధిని సాధించింది. ఈ నెలలో కంపెనీ విక్రయాలు 57 శాతం వృద్ధి చెంది 480 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 306 యూనిట్లుగా ఉన్నట్లు ఆడి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. రానున్న రోజుల్లో కూడా కంపెనీ ఇదే వృద్ధిని సాధించగలదని ఆడి ఇండియా హెడ్ మైఖేల్‌ పెష్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో 3,000 ఆడి కార్లను విక్రయించి 81 శాతం వృద్ధితో దేశీయ మార్కెట్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న లగ్జరీ బ్రాండ్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు.

ఈ ఏడాది భారత మార్కెట్లో 4,000 ఆడి కార్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించామని, ఇందుకోసం ఇప్పటికే కంపెనీ ప్రిమీయం లగ్జరీ సెడాన్ ఆడి ఏ8 (ధర రూ. 89 లక్షలు)ను ప్రవేశపెట్టిందని, త్వరలోనే ఏ-సిరీస్‌లో మరో రెండు లగ్జరీ మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు. కాగా.. తాజాగా విడుదల చేసిన ఆడి ఏ8 లగ్జరీ కారు 4.2 ఎఫ్‌ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో తక్కువ బరువు ఉండే అల్యూమినియం బాడీతో లభిస్తుంది. దీని ఇంటీరియర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆడి ఇండియా న్యూఢిల్లీలో 30 వేల చదరపు అడుగులు కలిగిన అతిపెద్ద కార్ల షోరూమ్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో 20 మోడళ్లను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.

More from DriveSpark

Article Published On: Monday, February 7, 2011, 12:26 [IST]
English summary
There won’t be any other impressive performance for the German car maker Audi whose sale mark saw 57% rise in January. This came with the sale of 480 units from the last year’s 306 units, and the performance has boosted the company’s hopes in the coming days too, said its Head for India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+