భారత రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సత్తా ఎంత..?

దేశంలో నానాటికీ పెరుగుతున్న వాహన వినియోగదారులు కారణంగా.. కాలుషితమవుతున్న వాతావరణం, భగ్గుమంటున్న ఇంధన ధరలు, సామాన్యుడు మోయలేని వెహికల్ సర్వీసింగ్ బిల్లులు.... వెరసి ఆటోమొబైల్ కంపెనీలు కొత్త రాగాన్ని అందుకునేలా చేశాయి. ఆ రాగం ఏంటంటే.. "ఎలక్ట్రిక్ వాహనాలు". ప్రస్తుతం స్వదేశీ మార్కెట్లలో ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ కార్లు విరివిగా లభిస్తున్నాయి. ఇందుకోసం దేశీయ విదేశీయ కంపెనీలు పోటీ పడి మరీ ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తున్నాయి.

వాస్తవానికి శిలాజ ఇంధనాలు (భూమిలో ఉండే వాయువులు, ముడిచమురు లాంటివి) తక్కువగా ఉండే భారత్‌ వంటి దేశాలలో హైబ్రిడ్ వాహనాల ఆలోచన మంచి ప్రత్యామ్నాయమే. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు జీవ ఇంధనం (బయో డీజిల్), ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, ఇంధన సెల్ (ఫ్యూయెల్ సెల్) వాహనాలు రోడ్లపై హల్ చల్ చేయనున్నాయి.

నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలకు మెయింటినెన్స్ ఖర్చు మిగతా వాహనాల కన్నా చాలా తక్కువగా ఉంటుంది. పైగా వీటిని నడపడం కూడా చాలా తేలిక. ఇందులో గేర్లు, ఇంజన్, బెల్ట్ లేదా చైన్ డ్రైవ్ ఉండదు. ఇవి పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవి, పైపెచ్చు కొన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా అవరసం లేదు. ఇంటికి వినియోగించే విద్యుత్‌తో వీటిని చార్జ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో యోబైక్స్, ఎకో వెహికల్స్, ఏస్ మోటార్స్, మహీంద్రా, రీనాల్ట్ వంటి ఎన్నో దేశీయ విదేశీయ కంపెనీలు ఈ విభాగంలో తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిని సారించాయి. ఈ విభాగంలో కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు మాత్రమే కాకుండా.. ఎంపిక చేసిన ప్రాంతాలలో మహీంద్రా "బిజిలి" అనే పది సీట్ల ప్యాసింజర్ వాహనాన్ని, లక్నోకు చెందిన స్కూటర్ ఇండియా ఎనిమిది సీట్ల ప్యాసింజర్ వాహనాలను కూడా అందిస్తున్నాయి.

పర్యావరణానికి మేలు చేయాలనుకోవడం, భావి తరాలకు ఇంధన వనరులను మిగల్చాలనే ఆలోచనలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. మెట్రో నగరాల్లో గంటలు గంటలు నిలిచిపోయే.. లేదా నత్త నడకన సాగే ట్రాఫిక్ జామ్‌‌లలోనూ.. దేశానికి పట్టుకొమ్మలుగా భావించే పల్లటూరి మట్టి రోడ్లపైనా ఈ ఎలక్ట్రిక్ కార్ల సత్తా ఎంత..? ఇలాంటి భారతీయ రోడ్లపై ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంత వరకూ పరుగులు తీయగలవనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఏదైతేనేం.. ఇలాగైనా మన పర్యావరణాన్ని రక్షించునే అవకాశం వస్తున్నందుకు అందరం సంతోషిద్దాం... ఆల్ ది వేరీ బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్...! మీ అభిప్రాయాలను కింద ఇచ్చిన కామెంట్ బాక్స్‌లో మాతో పంచుకోండి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 15, 2011, 16:04 [IST]
English summary
In coming years Electric vehicles are going to rule the auto markets. Especially for a fossil deficient country like India, Hybrid vehicles seems to be a good alternative source. Bio diesel, Electric, Hybrid, Fuel cell vehicles will replace the Petrol, Diesel, LPG vehicles in future.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+